Lionel Messi: మెస్సీ రిటైర్మెంట్‌పై ప్రచారం.. కోచ్‌ స్పందన..

2022 ప్రపంచకప్‌(FIFA World Cup) తర్వాత మెస్సీ(Lionel Messi) రిటైర్మెంట్‌పై జోరుగా ప్రచారం జరుగుతోంది. దీనిపై అర్జెంటీనా(Argentina) కోచ్‌ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.  

Updated : 13 Dec 2022 10:40 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: సాకర్‌ స్టార్‌ లియెనల్‌ మెస్సీ (Lionel Messi)కి ఇదే చివరి ప్రపంచకప్‌ (FIFA World Cup) అని భారీగా ప్రచారం జరుగుతోంది. ఈ నేపథ్యంలో  మెస్సీ(Lionel Messi) కూడా ఈ ప్రపంచకప్‌లో విశ్వరూపం చూపిస్తున్నాడు. ఐదు మ్యాచ్‌లు ఆడిన మెస్సీ (Lionel Messi) 4 గోల్స్‌ నేరుగా చేయగా.. మరో రెండు గోల్స్‌ చేయడానికి సహకారం అందించి ద్వితీయ స్థానంలో నిలిచాడు. నేడు క్రొయేషియాతో జరగనున్న మ్యాచ్‌ కోసం సిద్ధమవుతున్నాడు. 2014లో అర్జెంటీనా(Argentina) ఫైనల్స్‌కు చేరినా.. ప్రపంచకప్‌ అందుకోలేదు. మెస్సీ(Lionel Messi)కి ఇది లోటుగా నిలిచింది. ఇప్పుడు మెస్సీకి దాదాపు 35 ఏళ్ల వయసు. దీంతో మరో ప్రపంచకప్‌ ఆడే సమయానికి అతడికి 40ఏళ్లు వచ్చేస్తాయి. ఫిట్‌నెస్‌ ప్రాధాన్యంగా సాగే సాకర్‌లో అప్పటి వరకు ఆడటం ఓ సవాలే. 

ఈ నేపథ్యంలో ప్రపంచకప్‌ (FIFA World Cup) తర్వాత అంతర్జాతీయ కెరీర్‌కు మెస్సీ(Lionel Messi) వీడ్కోలు పలుకుతాడనే ప్రచారం జరుగుతోంది. ఈ టోర్నికి ముందు కూడా ఓ సందర్భంలో మెస్సీ(Lionel Messi) మాట్లాడుతూ ఇదే చివరి ప్రపంచకప్‌ కావొచ్చేమో అని వ్యాఖ్యానించాడు. తాజాగా కోచ్‌ లియోనల్‌ స్కాలనీ దీనిపై స్పందించాడు. ‘‘ప్రస్తుతం మెస్సీఆటతీరును ఎంజాయ్‌ చేస్తున్నాను. అతడు ఆటను కొనసాగిస్తాడో లేదో చూద్దాం. అతడు కొనసాగడం మాకు (అర్జెంటీనా జట్టుకు), ఫుట్‌బాల్‌ ప్రపంచానికి గొప్పవిషయం’’ అని పేర్కొన్నాడు.

మరోవైపు మెస్సీ(Lionel Messi) సమఉజ్జీగా పేరున్న పోర్చుగల్‌ ఆటగాడు క్రిస్టియానో రొనాల్డో ప్రపంచకప్‌(FIFA World Cup) కల చెదిరిపోయింది. మరో ప్రపంచకప్‌ తాను ఆడననే విషయాన్ని పరోక్షంగా ప్రస్తావిస్తూ ‘నా కల ముగిసింది’ అంటూ సామాజిక మాధ్యమాల్లో పోస్టు చేశాడు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని