IND vs NZ: ముంబయి టెస్టుకు పరిమిత సంఖ్యలో ప్రేక్షకులకు అనుమతి: ఎమ్‌సీఏ

న్యూజిలాండ్‌తో జరుగనున్న రెండో టెస్టుకు పరిమిత సంఖ్యలోనే ప్రేక్షకులకు అనుమతి ఇస్తామని ముంబయి క్రికెట్‌ అసోసియేషన్‌ (ఎమ్‌సీఏ) వెల్లడించింది. కరోనా నేపథ్యంలో మహారాష్ట్ర ప్రభుత్వ..

Published : 30 Nov 2021 01:46 IST

ఇంటర్నెట్ డెస్క్‌: న్యూజిలాండ్‌తో జరుగనున్న రెండో టెస్టుకు పరిమిత సంఖ్యలోనే ప్రేక్షకులకు అనుమతి ఇస్తామని ముంబయి క్రికెట్‌ అసోసియేషన్‌ (ఎమ్‌సీఏ) వెల్లడించింది. కరోనా నేపథ్యంలో మహారాష్ట్ర ప్రభుత్వ నిబంధనలకు లోబడి మ్యాచ్‌ని నిర్వహిస్తామని ప్రకటించింది. ముంబయిలోని వాంఖడే స్టేడియంలో డిసెంబరు 3 నుంచి టీమ్‌ఇండియా, న్యూజిలాండ్‌ జట్ల మధ్య రెండో టెస్టు మ్యాచ్‌ ప్రారంభం కానున్న విషయం తెలిసిందే.

‘కరోనా నిబంధనలను పక్కాగా పాటిస్తాం. రాష్ట్ర ప్రభుత్వ మార్గదర్శకాల మేరకు స్టేడియం సామర్థ్యంలో 25 శాతం మందికే అనుమతి ఇస్తాం. ఐదేళ్ల సుధీర్ఘ విరామం తర్వాత వాంఖడే స్టేడియం ఓ టెస్టు మ్యాచ్‌కు ఆతిథ్యం ఇవ్వనుంది. కాబట్టి, ప్రేక్షకులను ఆకట్టుకునేలా ఏర్పాట్లు చేస్తాం’ అని ఎమ్‌సీఏ సెక్రెటరీ సంజయ్‌ నాయక్‌ తెలిపారు. ఈ స్టేడియంలో చివరి సారిగా 2016 డిసెంబరులో భారత్, ఇంగ్లాండ్‌ జట్లు టెస్టు మ్యాచ్‌లో తలపడ్డాయి. వాంఖడే స్టేడియంలో ఒకేసారి 33 వేల మంది కూర్చుని మ్యాచ్‌ను వీక్షించొచ్చు. 

Read latest Sports News and Telugu News

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని