IND vs PAK: భారత్ X పాకిస్థాన్‌ పోరు.. మ్యాచ్‌ జరుగుతుందా..? వాతావరణం ఎలా ఉందంటే?

ఆసియా కప్‌లోనే (Asia Cup 2023) అత్యంత ఆసక్తికరమైన పోరు భారత్ - పాకిస్థాన్‌ (IND vs PAK) మ్యాచ్‌. అయితే, శ్రీలంక వేదికగా జరగనున్న ఈ మ్యాచ్‌కు వరుణుడు అంతరాయం కలిగించే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఓవర్లు కుదించైనా మ్యాచ్‌ జరిగితే చూడాలని అభిమానులు కోరిక. మరి వర్షం ఏం చేస్తుందో చూడాలి.

Updated : 02 Sep 2023 12:41 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: ప్రపంచవ్యాప్తంగా క్రికెట్‌ అభిమానులు ఆత్రుతగా ఎదురు చూస్తోన్న భారత్ - పాకిస్థాన్‌ (IND vs PAK) మ్యాచ్‌కు సమయం ఆసన్నమైంది. అయితే, ఫ్యాన్స్‌ను కలవరపెట్టేలా వాతావరణ పరిస్థితి ఉండటం గమనార్హం. ఆసియా కప్‌లో (Asia Cup 2023) భాగంగా ఈ మ్యాచ్‌ మధ్యాహ్నం 3 గంటలకు శ్రీలంకలోని పల్లెకెలె వేదికగా జరగనుంది. అయితే, మ్యాచ్‌కు వరుణుడు అంతరాయం కలిగించే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని వాతావరణ శాఖ నివేదికలు చెబుతున్నాయి. ప్రస్తుతం పల్లెకెలెలో మబ్బులతో కూడిన వాతావరణం ఉంది. మధ్యాహ్నం నుంచే చిన్నపాటి చినుకులు మొదలయ్యాయి.

IND vs PAK: ఆసియా కప్‌లో అసలు మజా

మధ్యాహ్నం 1 గంట నుంచి 3 గంటల వరకు వరుణుడు కాసేపు ఆగుతాడు. అయితే, మ్యాచ్‌ ప్రారంభమయ్యే మధ్యాహ్నం 3 గంటలకు మళ్లీ చినుకులు పడే అవకాశం ఉంది. అలా కొంచెం సమయం మాత్రమే పడి ఆగిపోతాయి. ఈ లోపు పిచ్‌ను సిద్ధం చేయాల్సి ఉంటుంది. ఇక్కడ నుంచి రాత్రి 7 గంటల వరకు వర్షం కాస్త ఆగే అవకాశం ఉంది. అయితే.. ఆకాశం మేఘావృతమై ఉంటుందని వాతావరణ శాఖ చెబుతోంది. పిచ్‌ను సిద్ధం చేసి మళ్లీ మ్యాచ్‌ను నిర్వహించేందుకు ప్రయత్నించినా.. రాత్రి 7 గంటల నుంచి మరోమారు వర్షం పడే అవకాశం ఉంది. ఈసారి వర్షం మోతాదు పెరుగుతుందని.. పూర్తి మ్యాచ్‌ జరుగుతుందనే నమ్మకం లేదని వాతావరణ శాఖ నివేదికనుబట్టి తెలుస్తోంది. ఒకవేళ ఓవర్లను కుదించి ఆడిస్తే మాత్రం  డక్‌వర్త్‌లూయిస్‌ పద్ధతిన విజేతను తేల్చే అవకాశాలు మెండుగా ఉంటాయి. అలాకాకుండా మ్యాచ్‌ రద్దు అయితే ఇరు జట్లకూ చెరో పాయింట్‌ వస్తుంది. దీంతో పాకిస్థాన్‌ సూపర్ -4కి చేరిపోతుంది. ఇక భారత్ మాత్రం నేపాల్‌తో జరగనున్న రెండో మ్యాచ్‌లో విజయం సాధించాల్సి ఉంటుంది. 

గంట గంటకూ ఇలా.. 

  • మధ్యాహ్నం 1 గంట: వర్షం కొనసాగే అవకాశం 58 శాతం. చిన్నపాటి చినుకులు..  తేమశాతం 81%.
  • మధ్యాహ్నం 2 గంటలు: మబ్బులు పట్టి ఉంటాయి. చినుకులు పడే అవకాశం 49 శాతం. తేమశాతం 82%. 
  • మధ్యాహ్నం 3 గంటలు: మళ్లీ చిన్నపాటి చినుకులు పడే అవకాశం 58 శాతానికి చేరింది. ఈసారి తేమశాతం 86%. 
  • సాయంత్రం 4 గంటలు: కాస్త చినుకులు ఆగే అవకాశం ఉంది. అయితే, మబ్బులు మాత్రం ఉంటాయి. 
  • సాయంత్రం 5 గంటలు: వర్షం పడే అవకాశాలు (34 శాతం) మరింత తగ్గుతాయి. మబ్బులు ఉన్నా.. మ్యాచ్‌ జరిగే అవకాశం ఉంది. 
  • సాయంత్రం 6 గంటలు: ఇప్పుడు కూడా వర్షం పడే అవకాశం తక్కువే. కానీ, మబ్బులు ఉండటంతో ఎప్పుడు ఏం జరుగుంతుందో చెప్పలేని పరిస్థితి.
  • రాత్రి 7 గంటలు: వర్షం పడే అవకాశం ఎక్కువ. దాదాపు 60 శాతంగా ఉంది. తేమశాతం 98%. 
  • రాత్రి 8 గంటలు: వర్షం కాస్త తెరిపినిస్తుంది. అలాగని పూర్తిగా ఆగుతుందని చెప్పలేని పరిస్థితి. అప్పటికీ చినుకులు పడే అవకాశం 49 శాతంగా ఉంది. తేమశాతం 99%.
  • రాత్రి 9 గంటల నుంచి అర్ధ రాత్రి 12 గంటలు: మళ్లీ వరుణుడు అంతరాయం కలిగిస్తాడు. ఈసారి వర్షం పెరిగే అవకాశం (60 శాతం నుంచి 65 శాతానికి పెరుగుదల) ఉంది. 

గమనిక: ఆక్యూవెదర్‌ నివేదిక ప్రకారం.. ఆ సమయానికి వాతావరణంలో మార్పులు ఉండొచ్చు.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని