Team India: ‘సూపర్‌ 8’లో ఈ మైనస్‌లు ప్లస్‌లు అవ్వాలి.. ప్లస్‌లు కొనసాగాలి!

టీ20 ప్రపంచకప్‌లో లీగ దశ ముగిసింది. ఆసక్తికర సూపర్‌ 8 పోరు నేటి నుంచి ప్రారంభం కానుంది.

Published : 19 Jun 2024 16:58 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: టీ20 ప్రపంచకప్‌(T20 world cup)లో టీమ్‌ఇండియా(Team India) సూపర్‌ 8 పోరుకు సిద్ధమైంది. గురువారం అఫ్గానిస్థాన్‌తో తన తొలి మ్యాచ్‌ను ఆడనుంది. ఆడిన నాలుగింట్లో మూడు విజయాలతో గూప్‌ A నుంచి తదుపరి దశకు రోహిత్‌ సేన దూసుకొచ్చినప్పటికీ.. జట్టు ప్రదర్శనలో కొన్ని లోటుపాట్లు కనిపిస్తున్నాయి. సూపర్‌ 8 ప్రయాణం మొదలుకానున్న నేపథ్యంలో అవేంటో చూద్దాం! అలాగే ప్లస్‌లపైనా లుక్కేద్దాం!

మైనస్‌లివే..

 • ఐపీఎల్‌ టాప్‌ స్కోరర్‌ విరాట్‌ కోహ్లీ(Virat Kohli).. ప్రపంచకప్‌ లీగ్‌ దశలో తేలిపోయి తీవ్ర విమర్శలు ఎదుర్కొన్నాడు. ఓపెనర్‌గా బరిలోకి దిగిన విరాట్‌.. ఆడిన మూడు మ్యాచ్‌ల్లో చేసిన పరుగులు వరుసగా 1,4,0. అమెరికా పిచ్‌లపై ఎంతగా ఇబ్బంది పడ్డాడో ఈ గణాంకాలు చూస్తే అర్థమవుతోంది. 
 • సారథి రోహిత్‌ శర్మ(Rohit Sharma) తొలి మ్యాచ్‌లో ఐర్లాండ్‌పై అర్ధ శతకంతో ఆకట్టుకున్నప్పటికీ.. ఆ తర్వాత ఆశించిన మేర రాణించలేదు. వరుసగా రెండు మ్యాచుల్లోనూ తక్కువ పరుగులకే పెవిలియన్‌కు చేరాడు. 
 • స్పెషలిస్టు స్పిన్నర్లు చాహల్‌, కుల్‌దీప్‌లు మ్యాచ్‌ ప్రాక్టీస్‌ లేకుండా నేరుగా సూపర్‌ 8 మ్యాచ్‌ల్లో బరిలోకి దిగబోతున్నారు. లీగ్‌ దశలో ఆడిన స్పిన్‌ ఆల్‌రౌండర్లు జడేజా, అక్షర్‌ బంతితో పెద్దగా రాణించ లేదు.
 • బౌలర్లకు బాగా కలిసొచ్చిన న్యూయార్క్‌ పిచ్‌ల మీద సిరాజ్‌ ఆకట్టుకోలేకపోయాడు. మూడు మ్యాచుల్లో ఒక్క వికెట్‌ మాత్రమే తీశాడు. 
 • స్టార్‌ ఆల్‌రౌండర్‌ రవీంద్ర జడేజా మూడు మ్యాచుల్లో ఒక్క వికెట్టూ తీయలేకపోయాడు. అటు బ్యాట్‌తోనూ ఆకట్టుకోలేదు. పాక్‌పై కీలక సమయంలో దిగి డకౌట్‌గా వెనుదిరిగాడు.
 • ఫినిషర్‌గా తుది జట్టులోకి వచ్చిన శివమ్‌ దూబె ఆ పాత్రకు ఇప్పటివరకు న్యాయం చేయలేదు. బంతితో ఒక్క ఓవర్‌ మాత్రమే వేశాడు

ప్లస్‌లు..

 • రిషభ్‌ పంత్‌ పొట్టి ప్రపంచకప్‌లోనూ ఐపీఎల్‌ జోరును కొనసాగిస్తున్నాడు. నిలకడగా పరుగులు రాబడుతూ జట్టు విజయాల్లో కీలక పాత్ర పోషిస్తున్నాడు. 
 • తొలి రెండు మ్యాచ్‌ల్లో పెద్దగా రాణించని సూర్య.. అమెరికాతో మ్యాచ్‌లో ఫామ్‌లోకి రావడం సానుకూలాంశం. 
 • ఐపీఎల్‌లో ఆకట్టుకోని ఆల్‌రౌండర్‌ హార్దిక్‌ పాండ్య.. ప్రపంచకప్‌లో బంతితో రాణించాడు. మూడింట్లో ఏడు వికెట్లు తీసి.. టీమ్‌ఇండియా తరఫున అత్యధిక వికెట్లు తీసిన బౌలర్‌గా కొనసాగుతున్నాడు. 
 • పేస్‌ విభాగంలో అర్ష్‌దీప్‌ సింగ్‌ కీలకంగా వ్యవహరిస్తూ వికెట్లు పడగొడుతున్నాడు. ఆడిన మూడింట్లో 7 వికెట్లు తీయగా.. ఇందులో యూఎస్‌ఏపైనే నాలుగు వికెట్లతో సత్తా చాటాడు.
 • ఇక పేస్‌ దళాన్ని ముందుండి నడిపిస్తున్న బుమ్రా ఉండనే ఉన్నాడు. తొలి రెండు మ్యాచ్‌ల్లో తన ప్రదర్శనతో మ్యాచ్‌ ఆఫ్‌ ది మ్యాచ్‌గా నిలిచాడు.

మైనస్‌ల్లో ఉన్న విరాట్, రోహిత్‌, సిరాజ్‌ సూపర్‌ 8లో రాణిస్తే.. టీమ్‌ ఇండియాకు తిరుగుండదు. అదే సమయంలో లీగ్‌లో రాణించిన పంత్‌, సూర్య, హార్దిక్‌.. పేసర్లు బుమ్రా, అర్ష్‌దీప్‌ తమ జోరును కొనసాగించాల్సి ఉంటుంది. 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని