Viral Video: మీరే అంపైర్‌ అయితే.. ఈ బంతికి ఔటిస్తారా?

క్రికెట్‌లో అంపైర్లు తప్పుడు నిర్ణయాలు తీసుకోవడం మనం చాలాసార్లు చూసే ఉంటాం. దీంతో ఆటగాళ్లు ఔట్‌కాకున్నా చేసేదేంలేక నిరాశగా వెనుదిరుగుతారు...

Published : 27 Apr 2022 01:27 IST

ఆ అంపైర్‌ ఎలా ఔటిచ్చాడో మీరే చూడండి..

(Photo: LV= Insurance County Championship twitter video screenshot)

ఇంటర్నెట్‌డెస్క్‌: క్రికెట్‌లో అంపైర్లు తప్పుడు నిర్ణయాలు తీసుకోవడం మనం చాలాసార్లు చూసే ఉంటాం. దీంతో ఆటగాళ్లు ఔట్‌కాకున్నా చేసేదేం లేక నిరాశగా వెనుదిరుగుతారు. అది ప్రధానంగా ఎల్బీడబ్ల్యూల విషయంలో లేదా కీపర్‌ పట్టే క్యాచ్‌ల్లో స్పష్టత కొరవడి అటువంటి సంఘటనలు చోటుచేసుకొంటాయి. అయితే, ఇక్కడ మనం చెప్పుకునే విషయంలో.. ఓ అంపైర్‌ అనూహ్య రీతిలో ఔటివ్వడమే చర్చనీయాంశంగా మారింది. అది చూడ్డానికి హాస్యాస్పదంగానూ మారింది. దీంతో ఆ వీడియో ఇప్పుడు సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది.

కెంట్‌, హాంప్‌షైర్‌ జట్లు ఈనెల 21 నుంచి 24 వరకు కౌంటీ క్రికెట్‌లో తలపడ్డాయి. ఈ సందర్భంగా ఆదివారం కెంట్‌ ఆటగాడు జోర్డాన్‌ కాక్స్‌ బ్యాటింగ్‌ చేస్తుండగా బౌలర్‌ వేసిన ఓ బంతి వికెట్లకు దూరంగా ఆఫ్‌సైడ్‌ వెళుతుండగా.. కాలి ప్యాడ్‌తో అడ్డుకున్నాడు. అప్పటికే తన బ్యాట్‌ను వెనకవైపు ఉంచాడు. అయితే, ఆ బంతి జోర్డాన్‌ ప్యాడ్లకు తాకి గాల్లోకి లేచింది. వెంటనే అక్కడ షార్ట్‌ లెగ్‌లో ఫీల్డింగ్‌ చేస్తున్న వ్యక్తి దాన్ని ఒడిసిపట్టడంతో మిగిలిన ఆటగాళ్లంతా అప్పీల్‌ చేశారు. దీంతో జోర్డాన్‌ను అంపైర్‌ ఔట్‌గా ప్రకటించాడు. ఈ వీడియో చూసిన నెటిజన్లు.. మీరే అంపైర్‌ అయితే దీన్ని ఔటిస్తారా అని వ్యంగ్యంగా నిలదీస్తున్నారు. మీరూ ఆ వీడియో చూసి సరదాగా నవ్వుకోండి.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని