Wimbledon : రష్యా, బెలారస్‌ ప్లేయర్లపై వింబుల్డెన్ బ్యాన్‌.. స్పందించిన క్రెమ్లిన్‌

ఉక్రెయిన్‌పై యుద్ధం చేస్తున్న రష్యాకు..  దానికి సహకారం అందిస్తోన్న బెలారస్‌కు ..

Published : 21 Apr 2022 01:49 IST

ఇంటర్నెట్ డెస్క్‌ : ఉక్రెయిన్‌పై యుద్ధం చేస్తున్న రష్యాకు..  దానికి సహకారం అందిస్తోన్న బెలారస్‌కు వింబుల్డెన్‌ నిర్వాహకులు షాక్‌ ఇచ్చారు. జూన్ 27 నుంచి జులై 10వ తేదీ వరకు జరిగే వింబుల్డెన్ పోటీల్లో పాల్గొనకుండా నిషేధం విధించినట్లు నిర్వాహకులు ప్రకటించారు. దీంతో ప్రపంచ నంబర్‌ టూ ఆటగాడు డాని మెద్వెదెవ్‌ (రష్యా), మహిళల నాలుగో ర్యాంకర్‌ సబలెంక (బెలారస్‌)పై ప్రభావం చూపే అవకాశం ఉంది. అయితే క్రీడాకారులు వ్యక్తిగతంగా టూర్‌లో ఆడొచ్చని, దేశం తరఫున  మాత్రం పాల్గొనలేరని స్పష్టం చేశారు. గత వింబుల్డెన్‌లో సబలెంక సెమీస్‌కు చేరుకుంది. రష్యాకు చెందిన మెద్వెదెవ్‌తోపాటు 15వ ర్యాంకర్‌ అనస్థాసియా పావ్‌లచెంకోవా, బెలారస్‌ ప్లేయర్‌  విక్టోరియా అజరెంక ఇప్పటికే యుద్ధం వద్దని, శాంతి చేకూరాలని ఆకాంక్షించారు. 

రష్యా క్రీడాకారులపై నిషేధం విధించడంపై క్రెమ్లిన్‌ అధికార ప్రతినిధి దిమిత్రీ పెస్‌కోవ్ స్పందించారు. ‘‘ప్రపంచ టెన్నిస్‌లో మా దేశపు ఆటగాళ్లు టాప్‌లో ఉన్నారు. అందుకే రష్యా ప్లేయర్లపై నిషేధం విధిస్తే టోర్నీనే (వింబుల్డెన్) ఇబ్బంది పడుతుంది. రష్యా పట్ల కొన్ని రాజకీయ విద్వేషాలు, కుతంత్రాలు, శత్రువుల చర్యలకు క్రీడాకారులను బలి చేయడం ఆమోదయోగ్యం కాదు’’ అని ఆక్షేపించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని