T20 series: న్యూజిలాండ్‌తో టీ20 సిరీస్‌.. సీనియర్లకు విశ్రాంతి.!

వచ్చే నెలలో న్యూజిలాండ్‌తో జరగనున్న మూడు మ్యాచుల టీ20 సిరీస్‌కు.. పలువురు సీనియర్లకు విశ్రాంతినివ్వనున్నట్లు సమాచారం. టీ20 ప్రపంచకప్ ముగిసిన వెంటనే ఈ సిరీస్ ఉండటం, పలువురు ఆటగాళ్లు గత నాలుగు..

Published : 15 Oct 2021 01:30 IST

ఇంటర్నెట్ డెస్క్: వచ్చే నెలలో న్యూజిలాండ్‌తో జరగనున్న మూడు మ్యాచుల టీ20 సిరీస్‌కు.. పలువురు సీనియర్లకు విశ్రాంతినివ్వనున్నట్లు సమాచారం. టీ20 ప్రపంచకప్ ముగిసిన వెంటనే ఈ సిరీస్ ఉండటం, పలువురు ఆటగాళ్లు గత నాలుగు నెలలుగా వరుసగా బయో బబుల్‌లో గడుపుతుండటం ఇందుకు ప్రధాన కారణాలుగా తెలుస్తోంది. జూన్‌ నుంచి బయో బబుల్‌లో గడుపుతున్న విరాట్‌ కోహ్లి, రోహిత్‌ శర్మ, జస్ప్రీత్‌ బుమ్రా, మహమ్మద్‌ షమి వంటి కీలక ఆటగాళ్లకు విశ్రాంతి ఇవ్వనున్నట్లు విశ్వసనీయ వర్గాలు తెలిపాయి. అయితే, టీ20 ప్రపంచకప్ ముగిసిన వెంటనే నాయకత్వ బాధ్యతల నుంచి తప్పుకుంటానని కెప్టెన్ విరాట్‌ కోహ్లి ప్రకటించిన నేపథ్యంలో.. రోహిత్‌ శర్మకు విశ్రాంతి ఇవ్వాలా.. వద్దా.. అనే విషయంలో సందిగ్దం నెలకొంది. నవంబరు 17 నుంచి న్యూజిలాండ్‌తో టీ20 సిరీస్ ప్రారంభం కానున్న విషయం తెలిసిందే. 

ఇండియన్ ప్రీమియర్‌ లీగ్‌ (ఐపీఎల్‌)లో మెరుగ్గా రాణించిన ఆటగాళ్లకు ఈ సిరీస్‌లో అవకాశమివ్వనున్నారు. ఈ నేపథ్యంలో యువ ఆటగాళ్లు రుతురాజ్ గైక్వాడ్‌, హర్షల్ పటేల్‌, అవేశ్ ఖాన్‌, వెంకటేశ్‌ అయ్యర్ జట్టులో స్థానం కోసం పోటీపడుతున్నారు. ఇదిలా ఉండగా, జాతీయ క్రికెట్‌ అకాడమీ (ఎన్‌సీఏ)కి హెడ్‌ కోచ్‌గా వ్యవహరిస్తున్న రాహుల్‌ ద్రావిడ్‌.. న్యూజిలాండ్‌తో జరుగునున్న టీ20 సిరీస్‌కు తాత్కాలిక కోచ్‌గా వ్యవహరించనున్నారని ఊహాగానాలు వస్తున్నాయి.అయితే, సరైన సమయంలో తర్వాతి కోచ్‌ ఎవరో వెల్లడిస్తామని బీసీసీఐ వర్గాలు తెలిపాయి. టీమిండియా ప్రస్తుత కోచ్‌ రవి శాస్త్రి పదవి కాలం ఈ నెలతో ముగియనున్న విషయం తెలిసిందే.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని