INDW vs AUSW: మెరిసిన మిథాలీ, యస్తిక భాటియా.. 30 ఓవర్లకు భారత్‌ 144/2

ఐసీసీ వన్డే మహిళల ప్రపంచకప్‌లో ఆస్ట్రేలియాతో జరుగుతున్న మ్యాచ్‌లో టీమ్‌ఇండియా బ్యాటర్లు నిలకడగా ఆడుతున్నారు. 28 పరుగులకే రెండు వికెట్లు...

Updated : 19 Mar 2022 08:58 IST

(Photo: BCCI Womens  Twitter)

ఆక్లాండ్‌: ఐసీసీ వన్డే మహిళల ప్రపంచకప్‌లో ఆస్ట్రేలియాతో జరుగుతున్న మ్యాచ్‌లో టీమ్‌ఇండియా బ్యాటర్లు మిథాలీ రాజ్‌(50), యస్తిక భాటియా(49) నిలకడగా ఆడుతున్నారు. 28 పరుగులకే రెండు వికెట్లు కోల్పోయి ఇబ్బందుల్లో పడిన జట్టును వీరిద్దరు  ఆదుకున్నారు. ఎలాంటి భారీ షాట్లకు వెళ్లకుండా ఆచితూచి బ్యాటింగ్‌ చేస్తున్నారు. ఈ క్రమంలోనే మూడో వికెట్‌కు శతక భాగస్వామ్యంతో దూసుకుపోతున్నారు. దీంతో 30 ఓవర్లకు టీమ్‌ఇండియా స్కోర్‌ 144/2గా నమోదైంది. అంతకుముందు టాస్‌ ఓడి బ్యాటింగ్‌కు దిగిన భారత్‌కు ఆస్ట్రేలియా బౌలర్లు ఆదిలోనే షాకిచ్చారు. ఓపెనర్లు స్మృతి మంధాన (10), షెఫాలీ వర్మ(12)ను త్వరగానే పెవిలియన్‌ పంపారు. అయితే, తర్వాత క్రీజులో కుదురుకున్న మిథాలీ, భాటియా జోడీ ఆసీస్‌ బౌలర్లను సమర్థవంతంగా ఎదుర్కొంది. ఈ క్రమంలోనే 30వ ఓవర్‌లో మిథాలి 50 పరుగులు పూర్తి చేసుకుంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని