WPL: మార్చి 4 - 24 మధ్య మహిళల ప్రీమియర్ లీగ్!‌.. ఐపీఎల్ -15 సీజన్‌ ఫైనల్‌ అప్పుడేనా?

మహిళల ప్రీమియర్‌ లీగ్‌ (WPL) ఆరంభ సీజన్‌ను మార్చి 4- 24 మధ్య నిర్వహించే అవకాశం ఉంది. 

Published : 26 Jan 2023 01:33 IST

ఇంటర్నెట్‌ డెస్క్: మహిళల ప్రీమియర్‌ లీగ్‌ (మహిళల ఐపీఎల్) నిర్వహణకు చకచకా ఏర్పాట్లు జరుగుతున్నాయి. డబ్ల్యూపీఎల్ (WPL) ఆరంభ సీజన్‌ని మార్చి 4-24 మధ్య నిర్వహించాలని  నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. ఐపీఎల్‌-15  సీజన్‌ను మార్చి 31 లేదా ఏప్రిల్ 1న ప్రారంభించి మే 28న ఫైనల్‌ నిర్వహించే అవకాశం ఉంది. అయితే, దీనిపై బీసీసీఐ (BCCI) నుంచి ఎలాంటి అధికారిక ప్రకటన వెలువడలేదు. ఫిబ్రవరి మొదటివారంలో (WPL)కు సంబంధించిన ఆటగాళ్ల వేలం నిర్వహించే అవకాశం ఉందని బీసీసీఐ కార్యదర్శి జై షా పేర్కొన్నారు. ఆటగాళ్లను కొనుగోలు చేయడానికి ఒక్కో జట్టు రూ.12 కోట్లు వెచ్చించాలి. ప్రతి జట్టు 15-18 మంది ఆటగాళ్లను కొనుగోలు చేయొచ్చు.

WPLలో పాల్గొనే ఐదు జట్ల కోసం నిర్వహించిన వేలం వివరాలను బీసీసీఐ బుధవారం మధ్యాహ్నం వెల్లడించింది. ఐదు జట్ల ద్వారా రూ. 4670 కోట్ల భారీ మొత్తం సమకూరినట్లు పేర్కొంది. అహ్మదాబాద్‌ జట్టును అదానీ స్పోర్ట్స్‌లైన్ రూ.1,289 కోట్లకు, ముంబయి జట్టును ఇండియావిన్‌ స్పోర్ట్స్‌ రూ.913 కోట్లకు, బెంగళూరు జట్టును రాయల్‌ ఛాలెంజర్స్‌ స్పోర్ట్స్‌ రూ.901 కోట్లకు, దిల్లీ జట్టును జేఎస్‌డబ్ల్యూ జీఎంఆర్‌ క్రికెట్  రూ.810 కోట్లకు‌, లఖ్‌నవూ జట్టును కాప్రీ గ్లోబల్‌ హోల్డింగ్స్‌ రూ.757 కోట్లకు దక్కించుకున్నట్లు తెలిపింది. 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని