INDvsENG: డ్రా చేసుకున్న మహిళా టీమ్‌ఇండియా

ఇంగ్లాండ్‌ మహిళలతో జరిగిన ఏకైక టెస్టును టీమ్‌ఇండియా జట్టు డ్రా చేసుకుంది. తొలుత టాస్‌ గెలిచి బ్యాటింగ్‌ ఎంచుకున్న ఇంగ్లాండ్‌ 396/9 స్కోర్‌ వద్ద తొలి ఇన్నింగ్స్‌ డిక్లేర్‌ చేసింది. కెప్టెన్‌ హెదర్‌నైట్‌(95), సోఫియా డంక్లీ(74) అర్ధశతకాలతో రాణించారు...

Published : 20 Jun 2021 00:07 IST

రెండో ఇన్నింగ్స్‌లో రాణించిన షెఫాలీ, దీప్తి, స్నేహ రాణా

బ్రిస్టల్‌: ఇంగ్లాండ్‌ మహిళలతో జరిగిన ఏకైక టెస్టును టీమ్‌ఇండియా జట్టు డ్రా చేసుకుంది. తొలుత టాస్‌ గెలిచి బ్యాటింగ్‌ ఎంచుకున్న ఇంగ్లాండ్‌ 396/9 స్కోర్‌ వద్ద తొలి ఇన్నింగ్స్‌ డిక్లేర్‌ చేసింది. కెప్టెన్‌ హెదర్‌నైట్‌(95), సోఫియా డంక్లీ(74) అర్ధశతకాలతో రాణించారు. ఆపై టీమ్‌ఇండియా ఓపెనర్లు స్మృతి మంధాన(78), షెఫాలీ వర్మ(96) దంచికొట్టినా మిగతా సభ్యులు విఫలమయ్యారు. దాంతో భారత్‌ 231 పరుగులకే కుప్పకూలి 165 పరుగుల వెనుకంజలో నిలిచింది. ఈ క్రమంలోనే శుక్రవారం ఫాలోఆన్‌ ఆడిన భారత్‌ మూడోరోజు ఆట నిలిచే సమయానికి 83/1 స్కోర్‌తో నిలిచింది. ఇక చివరి రోజు శనివారం ఆట కొనసాగించిన టీమ్‌ఇండియా మరో ఏడు వికెట్లు కోల్పోయి ఇంకో 261 పరుగులు చేసింది. దాంతో ఆట నిలిచిపోయేసరికి భారత్‌ 344/8 స్కోర్‌ సాధించింది. రెండో ఇన్నింగ్స్‌లో షెఫాలీ వర్మ(63), దీప్తి శర్మ(54), స్పేహ రాణా(80*) అద్భుతంగా ఆడారు. చివరికి ఇంగ్లాండ్‌ రెండో ఇన్నింగ్స్‌లో బ్యాటింగ్‌ చేసే అవకాశం రాకపోవడంతో మ్యాచ్‌ డ్రాగా ముగిసింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని