INDW vs PAKW: ఆదిలోనే తడబడిన భారత్‌.. పేలవ ఆరంభం

ఐసీసీ మహిళల వన్డే ప్రపంచకప్‌లో పాకిస్థాన్‌తో జరుగుతున్న తొలి వన్డేలో టీమ్‌ఇండియా మహిళల జట్టు పేలవంగా ఆరంభించింది. ఓపెనర్‌ షెఫాలి వర్మ (0) ఆదిలోనే డకౌట్‌గా వెనుదిరిగింది...

Updated : 06 Mar 2022 07:34 IST

బే ఓవల్‌: ఐసీసీ మహిళల వన్డే ప్రపంచకప్‌లో పాకిస్థాన్‌తో జరుగుతున్న తొలి వన్డేలో టీమ్‌ఇండియా మహిళల జట్టు పేలవంగా ఆరంభించింది. టాస్‌ గెలిచి బ్యాటింగ్‌ ఎంచుకున్న భారత జట్టుకు పాక్‌ అమ్మాయిలు ఆదిలోనే షాకిచ్చారు. డయానా బేగ్‌ మూడో ఓవర్‌లో షెఫాలీ వర్మ(0)ని బౌల్డ్‌ చేసింది. దీంతో భారత్‌ నాలుగు పరుగుల వద్దే తొలి వికెట్‌ కోల్పోయింది. అనంతరం వన్‌డౌన్‌ బ్యాటర్‌ దీప్తి (8)తో కలిసి బ్యాటింగ్‌ కొనసాగిస్తున్న ఓపెనర్‌ స్మృతి మంధాన (23) ఇన్నింగ్స్‌ నిర్మించే ప్రయత్నం చేస్తోంది. ఈ క్రమంలోనే టీమ్‌ఇండియా 10 ఓవర్లకు 33/1తో కొనసాగుతోంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని