Babar Azam: టాప్‌-4 చిన్న విషయం.. ప్రపంచకప్‌ గెలవడమే మా లక్ష్యం : బాబర్ అజామ్

ప్రపంచకప్‌లో ఆడేందుకు భారత్‌కు బయలుదేరేముందు నిర్వహించిన ప్రెస్ కాన్ఫరెన్స్‌లో బాబర్ అజామ్‌ (Babar Azam) మాట్లాడాడు. భారత్‌లో తమకిది మొదటి పర్యటన అయినప్పటికీ పెద్దగా ఒత్తిడికి గురికావడం లేదని పేర్కొన్నాడు.

Published : 27 Sep 2023 02:06 IST

ఇంటర్నెట్ డెస్క్: వన్డే ప్రపంచకప్‌ సందర్భంగా పాకిస్థాన్‌ కెప్టెన్ బాబర్ అజామ్‌ (Babar Azam) తన కెరీర్‌లో మొదటిసారి భారత్‌లో పర్యటించనున్నాడు. అతడే కాదు ప్రస్తుతం పాక్ జట్టులో ఉన్న చాలామంది ఆటగాళ్లకు ఇదే మొదటి పర్యటన. ఉపఖండ పరిస్థితులలో మంచి ప్రదర్శన కనబరుస్తున్న పాక్‌ జట్టుపై అంచనాలు ఎక్కువగానే ఉన్నాయి. ప్రస్తుతం ఆ జట్టు వన్డే ర్యాంకింగ్స్‌లో రెండో స్థానంలో ఉంది. ప్రపంచకప్‌లో ఆడేందుకు భారత్‌కు బయలుదేరేముందు నిర్వహించిన ప్రెస్ కాన్ఫరెన్స్‌లో బాబర్ అజామ్‌ మాట్లాడాడు. భారత్‌లో తమ జట్టుకు ఇదే మొదటి పర్యటన అయినప్పటికీ పెద్దగా ఒత్తిడికి గురికావడం లేదని పేర్కొన్నాడు.

‘‘ప్రపంచ కప్‌ కోసం వెళ్తున్నందుకు మేమందరం గర్విస్తున్నాం. మేము ఇంతకు ముందు భారత్‌లో ఆడనప్పటికీ పెద్దగా ఒత్తిడి తీసుకోవడం లేదు. అక్కడి (భారత్) పరిస్థితులపై అధ్యయనం చేశాం. వరల్డ్ కప్‌ కోసం ఈసారి నేను కెప్టెన్‌గా వెళ్తుండటం నాకు దక్కిన గొప్ప గౌరవం. ఈసారి ట్రోఫీతో తిరిగి వస్తామని ఆశిస్తున్నా. టాప్-4లో నిలవడమనేది మాకు చిన్న లక్ష్యం. మేము విజేతలుగా తిరిగి రావాలనుకుంటున్నాం. కొన్ని నెలల నుంచి నిరంతరంగా ఆడుతుండటం వల్ల ప్రపంచ కప్‌కు ముందు ఒక క్యాంప్‌ ఏర్పాటు చేయడానికి మాకు తగినంత సమయం దొరకలేదు. మేము ఆటగాళ్లకు విరామం ఇవ్వాలని కోరుకున్నాం. తద్వారా వారు రిఫ్రెష్‌ అయి గెలవాలనే పట్టుదలతో తిరిగి వస్తారు. అలా గెలవాలనే కసి ఉన్నప్పుడు బాగా ఆడతారు’’ అని బాబర్ అజామ్ వివరించాడు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

    ap-districts
    ts-districts

    సుఖీభవ

    చదువు