
IND vs NZ: భారత్‌ని సొంత గడ్డపై ఓడించడం కఠిన సవాలే: ట్రెంట్ బౌల్ట్
ఇంటర్నెట్ డెస్క్: టీమిండియాను సొంతగడ్డపై ఓడించడం కఠిన సవాలేనని న్యూజిలాండ్ బౌలర్ ట్రెంట్ బౌల్ట్ అన్నాడు. భారత్‌ని ఎదుర్కొనేందుకు కివీస్ ఆటగాళ్లు ఆతృతగా ఎదురు చూస్తున్నారని పేర్కొన్నాడు. ‘ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్)లో ఆడటంతో ఇక్కడి పిచ్‌లపై మంచి అవగాహన ఏర్పడింది. ఎలా బౌలింగ్ చేయాలి?, ఎన్ని పరుగులు చేస్తే గెలిచే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి? అనే విషయాల్లో స్పష్టత వచ్చింది. ఇవన్నీ మా జట్టుకు కలిసొచ్చే అంశాలు. ఆరంభంలోనే కీలక వికెట్లు పడగొడితే మ్యాచ్‌లో పై చేయి సాధించొచ్చు. అందుకోసం ఎలా బౌలింగ్ చేయాలో కూడా నాకు తెలుసు. ప్రస్తుతం మా ఆటగాళ్లంతా మంచి ఫామ్‌లో ఉన్నారు’ అని బౌల్ట్ పేర్కొన్నాడు.
గత కొద్దికాలంగా విరామం లేకుండా క్రికెట్ ఆడుతున్న న్యూజిలాండ్ కెప్టెన్ కేన్ విలియమ్సన్‌కు ఆ దేశ క్రికెట్ బోర్డ్ విశ్రాంతినిచ్చింది. దీంతో బుధవారం నుంచి భారత్‌తో ప్రారంభం కానున్న టీ20 సిరీస్‌కు కివీస్ బౌలర్ టిమ్ సౌథీని తాత్కాలిక కెప్టెన్‌గా నియమించింది. ఇప్పటికే భారత్‌కి చేరుకున్న న్యూజిలాండ్ జట్టు మ్యాచ్ సన్నాహాలు ప్రారంభించింది.
► Read latest Sports News and Telugu News
ఇవీ చదవండి
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.