Rishab Pant: బోర్డర్ - గావస్కర్ ట్రోఫీలో రిషభ్‌పంత్ లేకపోవడం బాధాకరం: రికీ పాంటింగ్
గతేడాది రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడ్డ రిషభ్‌పంత్ ఫిబ్రవరిలో జరిగే బోర్డర్ - గావస్కర్ ట్రోఫీకి అందుబాటులో ఉండడు. గత సిరీస్‌లో అద్భుత ప్రదర్శన చేసిన పంత్ ఈ ట్రోఫీలో పాల్గొనలేకపోవడం బాధాకరమని ఆస్ట్రేలియా క్రికెటం దిగ్గజం రికీ పాంటింగ్ అన్నాడు.
ఇంటర్నెట్ డెస్క్: బోర్డర్ - గావస్కర్ ట్రోఫీకి భారత వికెట్ కీపర్ రిషభ్‌పంత్ దూరమవడం బాధాకరమని ఆస్ట్రేలియా క్రికెట్ దిగ్గజం రికీ పాంటింగ్ అన్నాడు. 2021లో ఆస్ట్రేలియాలో జరిగిన సిరీస్‌లో రిషభ్ అద్భుతమైన ప్రదర్శన చేశాడని గుర్తు చేశాడు. ఐపీఎల్‌లో రిషభ్‌పంత్ కెప్టెన్‌గా ఉన్న దిల్లీ కాపిటల్స్ జట్టుకు రికీ ప్రధాన కోచ్‌గా వ్యవహరిస్తున్నాడు. భారత్-ఆస్ట్రేలియా మధ్య రెండేళ్లకోసారి బోర్డర్ - గావస్కర్ ట్రోఫీ పేరిట నాలుగు మ్యాచ్‌ల టెస్టు సిరీస్ జరుగుతుంది. ఫిబ్రవరిలో ప్రారంభమయ్యే ఈ సిరీస్‌కు భారత్ ఆతిథ్యమివ్వబోతోంది. గతేడాది డిసెంబరులో రోడ్డు ప్రమాదంలో గాయపడ్డ రిషభ్‌పంత్ ఈ సిరీస్‌లో పాల్గొనడం కష్టమే. ఈ నేపథ్యంలో రిషభ్‌పంత్ ఈ సిరీస్‌కు దూరమవడం బాధాకరమని, అతడి ఆటను చూడటం కోసం ప్రపంచం ఎదురుచూస్తోందని రికీ పాంటింగ్ వ్యాఖ్యానించాడు.
‘‘ఆస్ట్రేలియాలో జరిగిన గత సిరీస్‌లో రిషభ్ పంత్ అద్భుతమైన ప్రదర్శన చేశాడు. నాలుగు టెస్టుల ఈ సిరీస్‌కి మళ్లీ సమయం వచ్చింది. ఈ సిరీస్ కోసం రిషభ్ ఎంతగానో ఎదురుచూశాడు. కానీ ఈసారి సిరీస్‌లో రిషభ్ లేకపోవడం బాధాకరం. అద్భుతమైన అతడి ఆటను చూడటం కోసం ప్రపంచం ఎదురుచూస్తోంది. పంత్‌ను మొదట చూసినప్పుడు అతడు టెస్టుల కన్నా టీ20, వన్డేల్లో గొప్పగా రాణించగలడని భావించాం. కానీ మా ఆలోచనల్ని తలకిందులు చేస్తూ అతడు టెస్టు క్రికెట్‌లో అద్భుతమైన ప్రదర్శనలు చేశాడు’’ అని రికీ పేర్కొన్నాడు.
ఇవీ చదవండి
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
India News
Supreme Court: లోక్‌సభ సభ్యత్వ అనర్హత.. ఫైజల్ అహ్మద్ పిటిషన్‌పై విచారణ నేడు
-
Crime News
Cyber Crime : ఇంట్లో కూర్చోబెట్టే కాజేత
-
World News
Saudi Arabia: సౌదీలో ఘోర రోడ్డు ప్రమాదం.. 20 మంది హజ్ యాత్రికుల మృతి
-
Politics News
Vangalapudi Anitha: 40 మంది ఎమ్మెల్యేలు టచ్‌లో ఉన్నారు: అనిత
-
Politics News
Raghurama: నాడు తెదేపాలో లక్ష్మీపార్వతిలాగా నేడు వైకాపాలో సజ్జల వ్యవహరిస్తున్నారు
-
World News
వయసు 14.. బూట్ల సైజు 23!.. అసాధారణ రీతిలో పెరుగుతున్న పాదాలు