Published : 25 Jan 2021 20:40 IST

టెస్టు ఛాంపియన్‌షిప్ వాయిదా!

ఇంటర్నెట్‌డెస్క్: ఐసీసీ టెస్టు ఛాంపియన్‌షిప్‌ ఫైనల్‌ వాయిదా పడనున్నట్లు తెలుస్తోంది. లార్డ్స్‌ వేదికగా జూన్‌ 18 నుంచి 22 వరకు ఫైనల్‌ నిర్వహించనున్నారని సమాచారం. జూన్‌ 23ను రిజర్వ్‌డేగా కొనసాగించనున్నారని తెలుస్తోంది. టెస్టు నిర్వహించే అయిదు రోజుల్లో వాతావరణ, ఇతర కారణాల వల్ల ఆటకు ఆటంకం ఏర్పడితే రిజర్వ్‌డే రోజు కూడా మ్యాచ్‌ను కొనసాగిస్తారు. అయితే వాయిదాపై ఐసీసీ ఎలాంటి అధికారిక ప్రకటన చేయలేదు. గతంలో ఐసీసీ తెలిపిన షెడ్యూల్ ప్రకారం.. జూన్‌ 10-14 వరకు టెస్టు ఛాంపియన్‌షిప్‌ తుదిపోరు జరగాల్సి ఉంది.

కాగా, టెస్టు ఛాంపియన్‌షిప్ ఫైనల్‌ రేసు ఆసక్తికరంగా సాగుతోంది. తుదిపోరుకు అర్హత సాధించడానికి భారత్, న్యూజిలాండ్, ఆస్ట్రేలియా, ఇంగ్లాండ్‌ జట్లు పోటీపడుతున్నాయి. పాయింట్ల పట్టికలో టీమిండియా (71.7%) అగ్రస్థానంలో ఉంది. ఆ తర్వాతి స్థానాల్లో న్యూజిలాండ్‌ (70%), ఆస్ట్రేలియా (69.2%), ఇంగ్లాండ్‌ (68.7%) ఉన్నాయి. పట్టికలో విజయాల శాతం అధికంగా ఉన్న మొదటి రెండు జట్లు ఫైనల్‌కు అర్హత సాధిస్తాయనే విషయం తెలిసిందే.

ఇదీ చదవండి

శార్దూల్, సిరాజ్ రచించిన గబ్బా బౌలింగ్ వ్యూహం!

ఆసీస్ వాళ్లున్నారని లిఫ్టు ఎక్కనివ్వలేదు: యాష్‌

Read latest Sports News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat, and Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

మరిన్ని