WTC Final: డబ్ల్యూటీసీ ఫైనల్‌.. భారత్‌ తొలి ఇన్నింగ్స్‌ 296/10

డబ్ల్యూటీసీ ఫైనల్‌ మ్యాచ్‌లో (WTC Final 2023) ఆసీస్‌కు భారీగా తొలి ఇన్నింగ్స్‌ ఆధిక్యం లభించింది. ఆసీస్ బౌలర్ల ధాటికి టీమ్‌ఇండియా తొలి ఇన్నింగ్స్‌లో 300 పరుగుల్లోపే ఆలౌటైంది.

Updated : 09 Jun 2023 19:21 IST

ఇంటర్నెట్ డెస్క్‌: ప్రపంచ టెస్టు ఛాంపియన్‌షిప్‌ ఫైనల్ (WTC Final 2023) భారత్‌ తొలి ఇన్నింగ్స్ ముగిసింది. ఓవర్‌నైట్‌ 151/5 స్కోరుతో మూడో రోజు ఇన్నింగ్స్‌ను కొనసాగించిన టీమ్ఇండియా మరో 145 పరుగులు జోడించి 296 పరుగులకు ఆలౌటైంది. అజింక్య రహానె (89), శార్దూల్ ఠాకూర్ (51) అర్ధశతకాలు సాధించారు. వీరిద్దరూ ఏడో వికెట్‌కు 109 పరుగులు జోడించారు. అయితే, ఆసీస్‌ బౌలర్లు ప్యాట్‌ కమిన్స్ 3, మిచెల్ స్టార్క్ 2, స్కాట్ బోలాండ్ 2, కామెరూన్ గ్రీన్ 2, నాథన్ లైయన్ ఒక వికెట్‌ తీశారు.

మూడో రోజు ఆట తొలి సెషన్‌లో శ్రీకర్‌ భరత్ (5)ను త్వరగా ఔట్‌ చేసిన ఆసీస్‌కు రహానె - శార్దూల్ కొరకరాని కొయ్యలా మారారు. కఠినమైన ఆసీస్‌ బౌలింగ్‌ను ఎదుర్కొని మరీ శతక భాగస్వామ్యం నిర్మించారు. అయితే, రెండో సెషన్‌ ప్రారంభించిన కాసేపటికే రహానెను ఔట్ చేసి వికెట్ల పతనానికి కమిన్స్‌ నాంది పలికాడు. అనంతరం వచ్చిన షమీ (13), ఉమేశ్ (5) క్రీజ్‌లో ఎక్కువసేపు నిలవలేకపోయారు. దీంతో భారత్‌ 296 పరుగులకే ఆలౌటైంది. ఇక ఆసీస్‌ను రెండో ఇన్నింగ్స్‌లో త్వరగా కట్టడి చేస్తేనే మ్యాచ్‌పై భారత్‌కు ఆశలు నిలుస్తాయి.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని