WTC Final: డబ్ల్యూటీసీ ఫైనల్.. కేఎల్ రాహుల్ స్థానంలో ఇషాన్‌ కిషన్‌

జూన్‌లో ఆస్ట్రేలియాతో జరిగే డబ్ల్యూటీసీ (WTC Final)కు కేఎల్ రాహుల్ స్థానంలో ఇషాన్‌ కిషన్‌ను ఎంపిక చేశారు. 

Published : 08 May 2023 19:51 IST

ఇంటర్నెట్ డెస్క్: టీమ్‌ఇండియా యువ బ్యాటర్‌ ఇషాన్‌ కిషన్‌కు టెస్టుల్లోకి పిలుపొచ్చింది. ప్రపంచ టెస్టు ఛాంపియన్ షిప్‌నకు ఎంపికై గాయం కారణంగా మ్యాచ్‌కు దూరమైన కేఎల్ రాహుల్ స్థానంలో ఇషాన్‌ కిషన్‌ను తీసుకుంటున్నట్లు బీసీసీఐ ఒక ప్రకటనలో పేర్కొంది. రుతురాజ్ గైక్వాడ్, ముఖేశ్ కుమార్‌, సూర్యకుమార్‌ యాదవ్‌లను స్టాండ్ బై ప్లేయర్లుగా ఎంపిక చేశారు.

డబ్ల్యూటీసీ ఫైనల్‌కు ఎంపికై ఐపీఎల్‌లో నెట్స్‌ బౌలింగ్‌ ప్రాక్టీస్ చేస్తూ గాయపడిన జయదేవ్‌ ఉనద్కత్ ప్రస్తుతం బెంగళూరులోని నేషనల్‌ క్రికెట్ అకాడమీలో చికిత్స పొందుతున్నాడు. కేకేఆర్ బౌలర్ ఉమేశ్ యాదవ్ ఆర్సీబీతో జరిగిన మ్యాచ్‌లో గాయపడ్డాడు. వీరిద్దరూ ప్రపంచ టెస్టు ఛాంపియన్‌ షిప్‌నకు అందుబాటులో ఉంటారా లేదా అనే దానిపై మరికొన్ని రోజుల్లో నిర్ణయం తీసుకుంటామని బీసీసీఐ వెల్లడించింది. భారత్‌, ఆస్ట్రేలియా మధ్య డబ్ల్యూటీసీ ఫైనల్‌ జూన్‌ 7న లండన్‌లోని ఓవల్‌లో మొదలుకానుంది.

ఐపీఎల్‌ 2023 టోర్నీలో  బెంగళూరు జట్టుతో జరిగిన మ్యాచ్‌లో లఖ్‌నవూ సూపర్ జెయింట్స్‌ కెప్టెన్‌ కేఎల్ రాహుల్‌ గాయపడిన విషయం తెలిసిందే. బౌండరీ లైన్‌ వద్ద బంతిని ఆపేందుకు పరుగెడుతూ.. ఒక్కసారిగా మైదానంలో కుప్పకూలిపోయాడు. తొడ కండరానికి గాయమవడంతో  మైదానంలో లేవలేకపోయాడు. దీంతో ఫిజియోలు వచ్చి అతడిని మైదానం నుంచి తీసుకెళ్లారు. ఆ తర్వాత లఖ్‌నవూ బ్యాటింగ్‌ ఆర్డర్‌లో చివర్లో వచ్చిన రాహుల్‌.. పరుగులు తీయడానికి ఇబ్బంది పడ్డాడు. త్వరలోనే తొడ గాయానికి కేఎల్ రాహుల్ సర్జరీ చేయించుకోనున్నాడు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు