WTC Final: భువీ ఉంటే స్వింగ్‌ చేసేవాడుగా!

ఐసీసీ ప్రపంచ టెస్టు ఛాంపియన్‌షిప్‌ ఫైనల్లో పేసర్‌ భువనేశ్వర్‌ కుమార్‌ను తీసుకుంటే బాగుండేదని టీమ్ఇండియా అభిమానులు అంటున్నారు. చల్లని వాతావరణం, మబ్బులు పట్టినప్పుడు అతడి బౌలింగ్‌ అత్యంత బాగుంటుందని పేర్కొంటున్నారు. అదనపు స్వింగ్‌ లభించే ఇంగ్లాండ్‌లో అతడు ప్రభావం..

Published : 21 Jun 2021 14:21 IST

వికెట్లు తీయకపోవడంపై అభిమానుల సెటైర్లు

ఇంటర్నెట్‌ డెస్క్‌: ఐసీసీ ప్రపంచ టెస్టు ఛాంపియన్‌షిప్‌ ఫైనల్లో పేసర్‌ భువనేశ్వర్‌ కుమార్‌ను తీసుకుంటే బాగుండేదని టీమ్ఇండియా అభిమానులు అంటున్నారు. చల్లని వాతావరణం, మబ్బులు పట్టినప్పుడు అతడి బౌలింగ్‌ అత్యంత బాగుంటుందని పేర్కొంటున్నారు. అదనపు స్వింగ్‌ లభించే ఇంగ్లాండ్‌లో అతడు ప్రభావం చూపించేవాడని తెలిపారు. న్యూజిలాండ్‌ ఓపెనర్లు 34 ఓవర్ల వరకు ఔటవ్వకపోవడంతో ఇలా అభిప్రాయపడుతున్నారు.

ఇంగ్లాండ్‌ పర్యటనకు భువనేశ్వర్‌ కుమార్‌ను సెలక్టర్లు ఎంపిక చేయలేదు. పదేపదే గాయాల పాలవుతుండటం, కోలుకొనేందుకు సమయం పడుతుండటమే ఇందుకు కారణం. కొన్నాళ్ల క్రితం వరకు అతడు ఫిట్‌గా లేడు. ఇంగ్లాండ్‌తో పరిమిత ఓవర్ల సిరీసులో పునరాగమనం చేశాడు. ఆ తర్వాత ఐపీఎల్‌ ఆడాడు. సుదీర్ఘ ఫార్మాట్‌ ఆడేందుకు అతడింకా సిద్ధం కాలేదని, వరుసగా రెండు మూడు నెలలు ఆడే దారుఢ్యం సంతరించుకోలేదని సెలక్టర్లు భావించారు. శ్రీలంక పర్యటననూ దృష్టిలో పెట్టుకొని ఇంగ్లాండ్‌ పర్యటనకు ఎంపిక చేయలేదు.

న్యూజిలాండ్‌తో జరుగుతున్న ఫైనల్లో తొలిఇన్నింగ్స్‌లో టీమ్‌ఇండియా 217 పరుగులకు ఆలౌటైంది. అయితే, ఆ తర్వాత బ్యాటింగ్‌కు దిగిన కివీస్‌ను ఔట్‌ చేయడం భారత బౌలర్లకు కష్టంగా మారింది. ఓపెనర్లు డేవాన్‌ కాన్వే (54; 153 బంతుల్లో), టామ్ లేథమ్‌ (30; 104 బంతుల్లో) తొలి వికెట్‌కు 70 పరుగుల భాగస్వామ్యం అందించారు. 34 ఓవర్లు ప్రయత్నించినా భారత్‌కు తొలి వికెట్‌ దక్కలేదు. బుమ్రా, షమి, ఇషాంత్‌ ఎంత శ్రమించినా కాన్వే పరుగులు చేస్తూనే ఉన్నాడు. సౌథాంప్టన్‌ వాతావరణం చల్లగా ఉండటంతో బంతిని రెండువైపులా స్వింగ్‌ చేసే భువీ ఉంటే బాగుండేదని అభిమానుల ఆకాంక్ష.





Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని