WTC Final: తొలిరోజు తొలి సెషన్‌ ఆట రద్దు

అనుకున్నదే జరిగింది! ఐసీసీ ప్రపంచ టెస్టు ఛాంపియన్‌షిప్‌ ఫైనల్‌కు వరుణుడు అడ్డంకులు మొదలుపెట్టాడు. మ్యాచ్‌ జరిగే సౌథాంప్టన్‌లో శుక్రవారం ఉదయం నుంచి వర్షం కురుస్తూనే ఉంది. దాంతో పిచ్‌ను, మైదానంలో కొంత భాగాన్ని కవర్లతో కప్పారు. మ్యాచ్‌ ఆరంభానికి గంట ముందు అంపైర్లు...

Updated : 18 Jun 2021 14:31 IST

బీసీసీఐ ట్వీట్‌

ఇంటర్నెట్‌ డెస్క్‌: అనుకున్నదే జరిగింది! ఐసీసీ ప్రపంచ టెస్టు ఛాంపియన్‌షిప్‌ ఫైనల్‌కు వరుణుడు అడ్డంకులు మొదలుపెట్టాడు. మ్యాచ్‌ జరిగే సౌథాంప్టన్‌లో శుక్రవారం ఉదయం నుంచి వర్షం కురుస్తూనే ఉంది. దాంతో పిచ్‌ను, మైదానంలో కొంత భాగాన్ని కవర్లతో కప్పారు. మ్యాచ్‌ ఆరంభానికి గంట ముందు అంపైర్లు మైదానంలోకి వెళ్లి పరీక్షించారు. జల్లులు ఎడతెరపి లేకుండా కురుస్తూనే ఉన్నాయి.

భారత్‌, న్యూజిలాండ్‌ పోరుకు అరగంటలో టాస్‌ పడుతుందనగా బీసీసీఐ అక్కడి వాతావరణ పరిస్థితులపై అప్‌డేట్‌ ఇచ్చింది. దురదృష్టవశాత్తు తొలిరోజు తొలి సెషన్‌ ఆట ఉండదని ప్రకటించింది. దాంతో అభిమానులు నిరాశపడ్డారు. మరోవైపు ఆటగాళ్లంతా వర్షం ఎప్పుడు ఆగిపోతుందా అని ఎదురుచూస్తున్నారు. న్యూజిలాండ్‌ ఆటగాళ్లు వెచ్చని కాఫీ తాగుతూ సేదతీరుతున్నారు. ఈ మేరకు బ్లాక్‌క్యాప్స్‌ ట్వీట్‌ చేసింది.



Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని