WTC Final: ఐసీసీ నిబంధనలు సరిగ్గాలేవ్: వీవీఎస్‌

ఐసీసీ నిబంధనలు సరిగ్గా లేవని టీమ్‌ఇండియా మాజీ క్రికెటర్‌ వీవీఎస్‌ లక్ష్మణ్ విమర్శించారు. ప్రపంచ టెస్టు ఛాంపియన్‌షిప్‌ ఫైనల్‌ జరుగుతున్న తీరు అభిమానులను నిరాశ పరిచిందన్నారు. ఛాంపియన్‌షిప్‌ అన్నప్పుడు విజేత ఎవరో తేలాలని పేర్కొన్నారు....

Published : 22 Jun 2021 11:32 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: ఐసీసీ నిబంధనలు సరిగ్గా లేవని టీమ్‌ఇండియా మాజీ క్రికెటర్‌ వీవీఎస్‌ లక్ష్మణ్ విమర్శించారు. ప్రపంచ టెస్టు ఛాంపియన్‌షిప్‌ ఫైనల్‌ జరుగుతున్న తీరు అభిమానులను నిరాశ పరిచిందన్నారు. ఛాంపియన్‌షిప్‌ అన్నప్పుడు విజేత ఎవరో తేలాలని పేర్కొన్నారు. నాలుగో రోజు ఆట రద్దు కావడంతో ఆయన అసంతృప్తి వ్యక్తం చేశారు.

‘అభిమానులు తీవ్ర నిరుత్సాహానికి గురవుతున్నారు. ఐసీసీ నియమాలు సరిగ్గా లేవని నాకనిపిస్తోంది. ఎవరెన్ని చెప్పినా అంతిమంగా విజేత ఎవరో తేల్చాలి. సమయం చాలా ఉండటంతో రోజుకు 90 ఓవర్ల చొప్పున ఐదు రోజుల్లో 450 ఓవర్లు పూర్తవుతాయని భావించా. ఐసీసీ నుంచి ఇదే ఆశించా. పైగా రిజర్వు డే ఉండటంతో ఉత్సాహంగా అనిపించింది. కానీ వర్షం ఇలాగే కురిస్తే రిజర్వుడేతో కలుపుకొనైనా మ్యాచును పూర్తి చేయగలరా అని సందేహం కలుగుతోంది’ అని లక్ష్మణ్‌ అన్నారు.

సౌథాంప్టన్‌లో వర్షం కురుస్తుండటంతో ఎప్పుడేం జరుగుతుందో అర్థం కావడం లేదు. వరుణుడి వల్ల తొలిరోజు పూర్తిగా మ్యాచ్‌ జరగలేదు. రెండో రోజు 64.4 ఓవర్ల ఆట సాధ్యమైంది. మూడో రోజు భారత్‌ను 217కు ఔట్‌ చేసిన కివీస్‌ 101/2తో నిలిచి పైచేయి సాధించింది. నాలుగోరోజు, సోమవారం నిరంతరాయంగా వర్షం కురవడంతో ఆట మొత్తంగా సాధ్యపడలేదు.

Read latest Sports News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram & Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని