
WTC Final: కివీస్ డ్రస్సింగ్ రూమ్‌లో గెలుపు సందడి చూశారా!
విజేతకు అభినందనలు తెలిపిన మాజీ క్రికెటర్లు
సౌథాంప్టన్: ఐసీసీ ప్రపంచ టెస్టు ఛాంపియన్‌షిప్ ఫైనల్‌లో న్యూజిలాండ్ ఘన విజయం సాధించింది. ఎనిమిది వికెట్ల తేడాతో టీమ్‌ఇండియాను ఓడించింది. ప్రపంచ విజేతగా ఆవిర్భవించాలని కొన్నేళ్లుగా కంటున్న కల నిజమవ్వడంతో గాలిలో తేలుతోంది! పట్టరాని సంతోషంతో ఉంది.
సీనియర్ బ్యాట్స్‌మన్ రాస్ టేలర్ విన్నింగ్ షాట్ కొట్టగానే న్యూజిలాండ్ డ్రస్సింగ్ రూమ్‌లో సందడి మొదలైంది. ఆటగాళ్లు ఒకర్నొకరు హత్తుకొంటూ.. గెంతులు వేస్తూ.. ఆనందం పంచుకున్నారు. ఇప్పుడా వీడియోలు వైరల్‌గా మారాయి. అంతేకాకుండా న్యూజిలాండ్‌ను ఎంతోమంది అభినందిస్తున్నారు. ప్రశంసల జల్లు కురిపిస్తూ ట్వీట్లు పెడుతున్నారు.
సౌథాంప్టన్ వేదికగా జరిగిన ఫైనల్‌లో వర్షమే కీలక పాత్ర పోషించింది. రెండురోజులు అసలు బంతి పడకుండా ఆట రద్దయింది. మరో రెండు రోజులు పూర్తి ఆట సాధ్యపడలేదు. దాంతో రిజర్వు డే అయిన బుధవారం ఫలితం తేలుతుందో లేదోనని భావించారు. కానీ టీమ్‌ఇండియా త్వరగా ఆలౌట్ కావడంతో స్వల్ప లక్ష్యాన్ని న్యూజిలాండ్ ఆచితూచి ఆడుతూనే ఛేదించింది. కోహ్లీసేన తొలి ఇన్నింగ్స్‌లో 217 పరుగులకు ఆలౌట్ కాగా, కివీస్ 249 పరుగులతో బదులిచ్చింది. 32 పరుగుల లోటుతో రెండో ఇన్నింగ్స్ ఆరంభించిన భారత్ 170కే కుప్పకూలింది. దాంతో కివీస్ 2 వికెట్లు నష్టపోయి సునాయాసంగా 140 పరుగులు చేసింది.
ఇవీ చదవండి
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.