WTC Final: పంత్‌ ఫైర్‌.. బౌన్సర్లతో కోహ్లీ సాధన

ఐసీసీ ప్రపంచ టెస్టు ఛాంపియన్‌షిప్‌ ఫైనల్‌కు టీమ్‌ఇండియా వేగంగా సన్నద్ధం అవుతోంది. దొరికిన సమయాన్ని సద్వినియోగం చేసుకుంటోంది. నిన్నటి వరకు అంతర్గత మ్యాచ్‌ ఆడిన భారత్‌ మంగళవారం నెట్స్‌లో శ్రమించింది. ముఖ్యంగా విరాట్‌ కోహ్లీ దేహానికి దూరంగా వెళ్లే బంతులు, షార్ట్‌పిచ్‌ బంతులను...

Published : 15 Jun 2021 20:25 IST

మెరిసిన గిల్‌, సిరాజ్‌, ఇషాంత్‌, జడేజా

ఇంటర్నెట్‌ డెస్క్‌: ఐసీసీ ప్రపంచ టెస్టు ఛాంపియన్‌షిప్‌ ఫైనల్‌కు టీమ్‌ఇండియా వేగంగా సన్నద్ధం అవుతోంది. దొరికిన సమయాన్ని సద్వినియోగం చేసుకుంటోంది. నిన్నటి వరకు అంతర్గత మ్యాచ్‌ ఆడిన భారత్‌ మంగళవారం నెట్స్‌లో శ్రమించింది. ముఖ్యంగా విరాట్‌ కోహ్లీ దేహానికి దూరంగా వెళ్లే బంతులు, షార్ట్‌పిచ్‌ బంతులను ప్రత్యేకంగా సాధన చేశాడు. అజింక్య రహానె, రిషభ్ పంత్‌ సైతం చెమటోడ్చారు.

ఇంగ్లాండ్‌లో బంతులు స్వింగవుతాయని తెలిసిందే. వేగంగా వచ్చే బంతులు సర్రున పక్కకి వెళ్లడంతో ఆటగాళ్లు తొందరపడతారు. వాటిని డ్రైవ్‌ చేయాలని భావిస్తుంటారు. బంతులు బ్యాటు అంచులకు తగిలి అనూహ్యంగా స్లిప్‌లో లేదా వికెట్‌ కీపర్‌కు చిక్కుతుంటారు. అందుకే అలాంటి బంతులను టీమ్‌ఇండియా ఆటగాళ్లు సాధన చేశారు. ఇందుకు సంబంధించిన వీడియోలను బీసీసీఐ పంచుకుంది. సౌథాంప్టన్‌లో కోహ్లీసేన ఏం చేస్తుందో ట్విటర్లో ఎప్పటికప్పుడు వీడియోలు పెడుతూనే ఉంది.

ఇక టీమ్‌ఇండియా అంతర్గత మ్యాచులో కుర్రాళ్లు అదరగొట్టారు. రిషభ్ పంత్‌, రవీంద్ర జడేజా, మహ్మద్‌ సిరాజ్‌, ఇషాంత్‌ శర్మ, శుభ్‌మన్‌ గిల్‌ మెరిశారు. నాలుగు రోజులు జరిగిన ఈ మ్యాచులో విరాట్‌ కోహ్లీ, అజింక్య రహానె జట్లు పోటీపడ్డాయి. వికెట్‌ కీపర్‌ బ్యాట్స్‌మన్‌ రిషభ్ పంత్‌ ఎప్పటిలాగే తన దూకుడు కొనసాగించాడు. 94 బంతుల్లో 121 పరుగులతో అజేయంగా నిలిచాడు. ఓపెనర్‌ శుభ్‌మన్‌ గిల్‌ సైతం 85 పరుగులు చేశాడు. రవీంద్ర జడేజా అజేయ అర్ధశతకం బాదేశాడు. ఇక సీనియర్‌ పేసర్‌ ఇషాంత్‌ శర్మ, హైదరాబాదీ ఆటగాడు మహ్మద్‌ సిరాజ్‌ వికెట్లు తీశారు. జూన్‌ 18న భారత్‌, న్యూజిలాండ్‌ ఫైనల్లో తలపడుతున్న సంగతి తెలిసిందే.








Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు