WTC Final: ప్రపంచ టెస్టు ఛాంపియన్ షిప్ ఫైనల్ తేదీ ఖరారు.. ఇంకా తేలని బెర్తులు
ప్రపంచ టెస్టు ఛాంపియన్ షిప్ ఫైనల్ (WTC Final) తేదీ ఖరారు అయింది. జూన్ 7-11 మధ్య డబ్ల్యూటీసీ ఫైనల్‌ని నిర్వహించున్నారు.
ఇంటర్నెట్ డెస్క్: ప్రపంచ టెస్టు ఛాంపియన్ షిప్ (డబ్ల్యూటీసీ) (WTC Final)ఫైనల్ తేదీని ఐసీసీ ఖరారు చేసింది. జూన్ 7-11 మధ్య లండన్‌లోని ది ఒవెల్ మైదానంలో ఈ మ్యాచ్‌ని నిర్వహించనున్నారు. జూన్ 12 తేదీని రిజర్వ్ డేగా ప్రకటించారు. 2025 టెస్టు ఛాంపియన్ షిప్ ఫైనల్‌కు కూడా ఇదే మైదానంలో జరగనుంది. ఇదిలా ఉండగా.. 2022-23 డబ్ల్యూటీసీ ఫైనల్ బెర్తులు ఇంకా ఖరారు కాలేదు. ఈ డబ్ల్యూటీసీ సైకిల్లో (2022-23) ఇంకా మూడు సిరీస్‌లు మిగిలి ఉన్నాయి. భారత్, ఆసీస్ మధ్య నాలుగు టెస్టుల సిరీస్ ( Border-Gavaskar Trophy), న్యూజిలాండ్, శ్రీలంక మధ్య రెండు టెస్టులు, సౌతాఫ్రికా, వెస్టిండీస్ మధ్య రెండు టెస్టులు జరగాల్సి ఉంది. అయితే, ఫైనల్లో తలపడే జట్లేవో ఇంకా తేలలేదు. ఆస్ట్రేలియా, భారత్, శ్రీలంక, దక్షిణాఫ్రికా పోటీలో ఉన్నాయి.
ప్రస్తుతం డబ్ల్యూటీసీ పాయింట్ల పట్టికను బట్టి చూస్తే.. ఆస్ట్రేలియా (Australia) ఫైనల్‌కు చేరడం ఖాయంగా కనిపిస్తోంది. భారత్‌తో ఆడే నాలుగు టెస్టుల్లో ఒకదానిని డ్రా చేసుకుని పెనాల్టీ పాయింట్లు పడకుండా జాగ్రత్త పడితే ఆ జట్టు డబ్ల్యూటీసీ ఫైనల్‌కు చేరుతుంది. మిగతా జట్ల ఫలితాలు ఆసీస్ ఫైనల్ బెర్తుపై ప్రభావం చూపే అవకాశాలు చాలా తక్కువగా ఉన్నాయి. టీమ్ఇండియా ( Team India) నేరుగా ఫైనల్ చేరాలంటే బోర్డర్ గావస్కర్ ట్రోఫీలో 3-1 లేదా అంతకంటే ఎక్కువ తేడాతో ఆస్ట్రేలియాను ఓడించాలి. ఒకవేళ అంతకంటే తక్కువ తేడాతో ఓడిస్తే భారత్ ఇతర జట్ల ఫలితాలపై ఆధారపడాల్సి ఉంటుంది.
ఇవీ చదవండి
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
General News
KTR: విశాఖ స్టీల్‌ప్లాంట్ ప్రైవేటీకరణ ఆపండి: కేంద్రానికి కేటీఆర్ బహిరంగ లేఖ
-
Crime News
Theft: వ్యాపారి ఇంట్లో భారీ చోరీ.. 80 తులాల బంగారం దోచుకెళ్లిన దొంగలు
-
Sports News
SRH vs RR: ఎస్ఆర్హెచ్ X ఆర్ఆర్.. గత చరిత్రను మరిచేలా గెలవాలి..!
-
Movies News
Upasana: నేను అందంగా లేనని ట్రోల్స్ చేశారు : ఉపాసన
-
Movies News
NMACC Launch: ఎన్ఎంఏసీసీ స్టేజ్‌పై ‘నాటు నాటు’.. డ్యాన్స్‌తో అదరగొట్టిన షారుఖ్, అలియా, రష్మిక
-
India News
Rahul Gandhi: జైలు శిక్షను సవాల్ చేస్తూ రేపే రాహుల్ పిటిషన్?