WTC Final: వరుణుడు ఆడనిచ్చేనా? 

ఎన్నో అంచనాలు.. ఎన్నెన్నో విశ్లేషణలు.. అరంగేట్రం ఐసీసీ ప్రపంచ టెస్టు ఛాంపియన్‌షిప్‌ ఫైనల్‌ హోరాహోరీగా జరుగుతుందని ఎంతోమంది భావించారు. సమవుజ్జీలైన భారత్‌, న్యూజిలాండ్‌ మధ్య రసవత్తరమైన పోరును వీక్షించొచ్చని ఆశించారు. ...

Updated : 19 Jun 2021 11:40 IST

సౌథాంప్టన్‌లో వాతావరణ పరిస్థితి ఏంటి?

సౌథాంప్టన్‌: ఎన్నో అంచనాలు.. ఎన్నెన్నో విశ్లేషణలు.. అరంగేట్రం ఐసీసీ ప్రపంచ టెస్టు ఛాంపియన్‌షిప్‌ ఫైనల్‌ హోరాహోరీగా జరుగుతుందని ఎంతోమంది భావించారు. సమవుజ్జీలైన భారత్‌, న్యూజిలాండ్‌ మధ్య రసవత్తరమైన పోరును వీక్షించొచ్చని ఆశించారు. అందుకు భిన్నంగా అభిమానుల ఆశలన్నీ అడియాసలే అయ్యాయి. కనీసం టాస్‌ పడకుండానే తొలిరోజు ఆట ముగిసింది. శుక్రవారం ఉదయం నుంచి సౌథాంప్టన్‌లో వరుణుడు టెస్టు మ్యాచ్‌ ఆడటమే ఇందుకు కారణం.

తొలిరోజు ఆట వర్షార్పణం కావడంతో రెండోరోజు ఆటైనా సవ్యంగా సాగుతుందో లేదోనన్న అనుమానాలు కలుగుతున్నాయి. శనివారం సౌథాంప్టన్‌ వాతావరణం ఎలా ఉంటుందోనని ఆరాతీస్తున్నారు. శుక్రవారంతో పోలిస్తే శనివారం వాతావరణం మెరుగ్గా ఉంటుందని సమాచారం.

ఉదయం కాస్త పొడిగానే ఉంటుందని అక్కడి వాతావరణ శాఖ తెలిపింది. మధ్యాహ్నం, సాయంత్రం మాత్రం వర్షం ముప్పు పొంచివుంది. 60% వాన పడుతుందని వివిధ వాతావరణ వెబ్‌సైట్లు సూచిస్తున్నాయి. దాంతో రెండోరోజు ఎన్ని సెషన్లు ఆట జరుగుతుందో చెప్పలేని పరిస్థితి నెలకొంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని