WTC Final:ఆ జట్టుకే కాస్త ఎక్కువ అవకాశం: బ్రెట్‌ లీ

ఇప్పుడు భారత క్రికెట్‌ అభిమానుల చూపంతా  ప్రపంచ టెస్టు ఛాంపియన్‌ షిప్‌(డబ్ల్యూటీసీ) ఫైనల్‌ పైనే ఉంది. ఎందుకంటే ఇది మొట్టమొదటి ఐసీసీ డబ్ల్యూటీసీ ఫైనల్‌. ఇందులో విజయం సాధించి చరిత్ర సృష్టించాలని ఫైనల్‌కు చేరిన భారత్‌, న్యూజిలాండ్‌ జట్లు  ఉవ్విళ్లూరుతున్నాయి

Published : 04 Jun 2021 19:03 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: ఇప్పుడు భారత క్రికెట్‌ అభిమానుల చూపంతా  ప్రపంచ టెస్టు ఛాంపియన్‌ షిప్‌(డబ్ల్యూటీసీ) ఫైనల్‌ పైనే ఉంది. ఎందుకంటే ఇది మొట్టమొదటి ఐసీసీ డబ్ల్యూటీసీ ఫైనల్‌. ఇందులో విజయం సాధించి చరిత్ర సృష్టించాలని ఫైనల్‌కు చేరిన భారత్‌, న్యూజిలాండ్‌ జట్లు  ఉవ్విళ్లూరుతున్నాయి. సౌథాంప్టన్‌ వేదికగా జూన్‌ 18-22 మధ్య ఈ పోరు జరగనుంది. ఈ రెండు జట్లూ అన్ని విభాగాల్లోనూ పటిష్టంగా ఉండటంతో ఏ జట్టు కప్‌ని ముద్దాడుతుందోనన్న చర్చ మొదలైంది. పలువురు క్రికెటర్లు భారత్ విజయం సాధిస్తుందని అంచనా వేస్తుంటే, మరికొంత మంది కివీస్‌ గెలుస్తుందని జోస్యం చెబుతున్నారు. ఆస్ట్రేలియా మాజీ ఫాస్ట్‌బౌలర్‌ బ్రెట్‌ లీ కూడా తన అంచనాను బయటపెట్టాడు. ఈ ఫైనల్‌లో భారత్‌ కంటే విలియమ్సన్‌ సారథ్యంలోని న్యూజిలాండ్‌కే విజయావకాశాలు కాస్త ఎక్కువగా ఉన్నట్లు బ్రెట్ లీ అభిప్రాయపడ్డాడు.


‘ఇంగ్లాండ్‌ పిచ్‌లు కివీస్‌కు సరిపోతాయి. ఎందుకంటే ఇక్కడి పిచ్‌పై వారు బ్యాటింగ్‌ చేస్తుంటే అది వారి స్వదేశంలో ఆడినట్టుగా ఉంటుంది. ఈ మ్యాచ్‌లో బౌలింగ్‌ కీలకంగా మారనుంది. ఫాస్ట్‌బౌలింగ్‌కు ఈ పిచ్‌స్వింగ్‌ అనుకూలంగా ఉండొచ్చు. వీటన్నింటిని పరిశీలిస్తే న్యూజిలాండ్‌కే కాస్త ఎక్కువ అవకాశం ఉంది. ఇక బ్యాటింగ్‌ విషయానికొస్తే, ఇరు జట్లు సమానంగా కనిపిస్తున్నాయి. రెండు జట్ల ఆటగాళ్లు స్వింగ్‌ బౌలింగ్‌ని బాగా ఆడగలరు. బౌలింగ్‌లో ఏ జట్టు ఉత్తమ ప్రదర్శన ఇస్తుందో ఆ జట్టే ఇందులో విజయం సాధిస్తుంది’ అని బ్రెట్‌ లీ అన్నాడు.

విరాట్‌ కోహ్లీ, విలియమ్సన్‌ కెప్టెన్సీల గురించి మాట్లాడుతూ..‘కేన్‌ విలియమ్సన్‌కు గొప్ప క్రికెట్‌ బ్రెయిన్‌ ఉంది. అంతేకాకుండా బోరింగ్ లేని కెప్టెన్‌. అవసరమున్నప్పుడు మాత్రమే బ్రెయిన్‌కి పదును పెట్టి ఆలోచిస్తాడు. ఓపిక కూడా ఎక్కువ. అది అతనికి, కివీస్‌కు అనుకూలంగా మారుతుంది. విరాట్‌ కోహ్లీ దూకుడైన కెప్టెన్‌. వీరిద్దరిలో ఎవరు కరెక్ట్ అని చెప్పడానికి నా దగ్గర సమాధానం లేదు. ఎందుకంటే నేను సంప్రదాయ, దూకుడైన కెప్టెన్ల కింద ఆడాను’ అని బ్రెట్ లీ ముగించాడు.

 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని