Yasir Shaw: 21వ శతాబ్దపు బెస్ట్‌ బాల్‌ ఇదేనా..!

‘బాల్‌ ఆఫ్‌ ది సెంచరీ’ఈ పదం విని ఎన్నిరోజులు అవుతుందో..ఎప్పుడో 1993లో ఆస్ట్రేలియా దిగ్గజ స్పిన్నర్‌

Updated : 24 Nov 2022 16:21 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: ‘బాల్‌ ఆఫ్‌ ది సెంచరీ’ ఈ పదం విని ఎన్నిరోజులవుతుందో.. ఎప్పుడో 1993లో ఆస్ట్రేలియా దిగ్గజ స్పిన్నర్‌ షేన్‌వార్న్‌ క్రికెట్‌ ప్రేమికులకు ‘బాల్‌ ఆఫ్‌ ది సెంచరీ’ అంటే ఏంటో పరిచయం చేశాడు. అప్పుడు ఓల్డ్ ట్రాఫోర్డ్‌ వేదికగా యాషెస్ సిరీస్‌లో భాగంగా జరిగిన తొలి టెస్టులో ఇంగ్లాండ్‌ బ్యాట్స్‌మన్‌ మైక్ గ్యాటింగ్‌ను వార్న్‌ అద్భుతమైన బంతితో క్లీన్‌ బౌల్డ్‌ చేశాడు. గ్యాటింగ్‌తో సహా అంపైర్లు ఆ లెగ్‌ స్పిన్‌ డెలివరీ చూసి ఆశ్చర్యపోయారు. మళ్లీ ఇన్నాళ్లకు అటువంటి బంతినే పాకిస్థాన్‌ స్పిన్నర్‌ యాసిర్‌ షా గుర్తుచేశాడు. శ్రీలంకతో గాలే వేదికగా జరుగుతున్న తొలి టెస్టులో కళ్లు చెదిరే స్పిన్నింగ్‌ డెలివరీతో కుశల్‌ మెండిస్‌ను బోల్తా కొట్టించాడు. శ్రీలంక రెండో ఇన్నింగ్స్‌ 56 ఓవర్లలో యాసిర్‌షా లెగ్‌స్టంప్‌ అవతల వేసిన బంతి..గింగిరాలు తిరుగుతూ ఆఫ్‌ స్టంప్‌ను గిరాటేసింది. దీంతో అప్పటివరకూ చక్కని షాట్లు ఆడుతూ 76 పరుగులతో క్రీజ్‌లో ఉన్న కుశల్ మెండిస్‌ ఆ బంతికి క్లీన్‌బౌల్డ్‌ అయ్యాడు. సోషల్‌ మీడియాలో ఈ రెండు ఔట్‌లను పోల్చి చూపుతూ అభిమానులు వీడియోలు పోస్టు చేస్తున్నారు.



Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని