Published : 01 Feb 2022 01:42 IST

Virat Kohli : నేనెప్పుడూ కెప్టెన్‌ లాగానే ఆలోచిస్తా : విరాట్‌ కోహ్లీ

ఇంటర్నెట్ డెస్క్‌ : ఇటీవల టీమ్‌ఇండియా టెస్టు కెప్టెన్సీకి ముగింపు పలికిన విరాట్ కోహ్లీ తాజాగా ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. జట్టుకి లీడర్‌గా కొనసాగేందుకు.. కెప్టెన్సీతో అవసరం లేదని అన్నాడు. జట్టులో సాధారణ ఆటగాడిగా కొనసాగినా.. తానెప్పుడూ కెప్టెన్ లాగానే ఆలోచిస్తానని చెప్పాడు. అన్ని ఫార్మాట్ల కెప్టెన్సీ నుంచి తప్పుకున్న నేపథ్యంలో కోహ్లీ ఇలాంటి వ్యాఖ్యలు చేయడం గమనార్హం. 

‘జట్టులో నాయకుడిగా ఉండటానికి.. కెప్టెన్సీతో అవసరం లేదు. ధోని కెప్టెన్సీ నుంచి తప్పుకున్నా అతడి స్థాయి తగ్గలేదు. జట్టులో కొనసాగినంత కాలం అతడి నుంచి సలహాలు తీసుకునే వాళ్లం. కెప్టెన్సీని వదిలేసి ముందుకు సాగడం కూడా నాయకుడి లక్షణమే. కాకపోతే, మన నిర్ణయాన్ని వెల్లడించేందుకు సరైన సమయాన్ని ఎంచుకోవాలి. అవకాశాలను సద్వినియోగం చేసుకుంటూ.. జట్టులో అన్ని రకాల పాత్రలను పోషించాలనుకుంటున్నాను. గతంలో ధోని కెప్టెన్సీలో నేను ఆడాను. ఆ తర్వాత కెప్టెన్‌గా పని చేశాను. అప్పుడూ, ఇప్పుడూ నా మైండ్‌సెట్ ఓకేలా ఉంది. జట్టులో సాధారణ ఆటగాడిగా కొనసాగినా.. నేనెప్పుడూ కెప్టెన్‌ లాగానే ఆలోచిస్తా. గెలుపోటములు అనేవి మన చేతుల్లో లేవు. కానీ, జట్టు కోసం ఎల్లప్పుడూ అత్యుత్తమంగా రాణించేందుకు ప్రయత్నించాలి. భారత జట్టు సంస్కృతిని మార్చడం చాలా కష్టమైన విషయం. నేను కెప్టెన్‌గా బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి జట్టులో విప్లవాత్మక మార్పులు తెచ్చేందుకు ప్రయత్నించాను. జట్టునెప్పుడూ అగ్రస్థానంలో నిలిపేందుకు కృషి చేశాను. ఎవరికైనా వారి లక్ష్యాలపై పూర్తి అవగాహన ఉండాలి. మన కెరీర్‌ ముగిసేలోపు వాటిని సాధించామా? లేదా? అనే విషయాన్ని పరీక్షించుకోవాలి. ప్రతి దానికి ఓ ముగింపు ఉంటుంది. ఈ విషయాన్ని అందరూ గ్రహించాలి. అప్పుడే, జట్టులో మన పాత్రకు పూర్తి న్యాయం చేయగలుగుతాం’ అని కోహ్లీ పేర్కొన్నాడు.

వాళ్లు చెప్పాల్సిన అవసరం లేదు..

‘జట్టులో మన పాత్ర ఏంటో తెలుసుకోవడం చాలా ముఖ్యం. అప్పుడే మన బాధ్యతలు ఏంటో.. మన పాత్రకు ఏ మేరకు న్యాయం చేయగలిగామో తెలుస్తుంది. జట్టులో నా పాత్రేంటో నాకు తెలుసు. వేరే వాళ్లు చెప్పాల్సిన అవసరం లేదు. ఆటగాళ్లతో కమ్యూనికేషన్ చాలా ముఖ్యం. మీ అభిప్రాయంతో నాకు సంబంధం లేదనే ధోరణి సరికాదు. ఏ విషయాన్ని అయినా గౌరవప్రదంగా చెప్పాలి. ఏ కష్టమొచ్చినా.. మనల్ని సంప్రదించేలా ఉండాలి. నేను అలాగే చేసే వాడిని. టీమ్‌ఇండియాలో నైపుణ్యమున్న ఆటగాళ్లకు కొదువలేదు. నాణ్యమైన ఆటగాళ్లను గుర్తించి వారిని మరింత ఉన్నంతంగా తీర్చిదిద్దాలి. అందుకోసం ప్రతి రోజూ కష్టపడి పని చేయాల్సి ఉంటుంది. అదో నిరంతర ప్రక్రియ. నేను భారత కెప్టెన్‌గా.. ఆటగాళ్లలో ఎలాంటి పరిస్థితుల్లోనైనా గెలవగలమనే నమ్మకాన్ని తీసుకొచ్చేందుకు ప్రయత్నించాను’ అని కోహ్లీ చెప్పాడు.

Read latest Sports News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని

సుఖీభవ

మరిన్ని