
Harshal Patel: ప్రపంచకప్ వరకు హర్షల్ చేత ఎక్కువగా బౌలింగ్ చేయించొద్దు: అజయ్ జడేజా
ఇంటర్నెట్ డెస్క్ : టీమిండియా పేసర్ హర్షల్ పటేల్‌పై మాజీ క్రికెటర్ అజయ్ జడేజా ప్రశంసలు కురిపించాడు. రానున్న టీ20 ప్రపంచకప్‌నకు ఇప్పటికిప్పుడు జట్టును ప్రకటించినా అందులో కచ్చితంగా హర్షల్ పేరు ఉంటుందని జోస్యం చెప్పాడు. వెస్టిండీస్‌తో ఆదివారం (ఫిబ్రవరి 20న) జరిగిన నామమాత్రమైన మూడో టీ20 మ్యాచులో హర్షల్ పటేల్ మెరుగైన ప్రదర్శన చేసిన విషయం తెలిసిందే. 4 ఓవర్లలో 22 పరుగులిచ్చి 3 వికెట్లు పడగొట్టి భారత విజయంలో కీలకంగా వ్యవహరించాడు.
‘టీ20 ప్రపంచకప్‌నకు ఇంకా చాలా సమయం ఉంది. అయితే, ఇప్పటికిప్పుడు ప్రపంచకప్ జట్టును ప్రకటించినా కచ్చితంగా సీనియర్ పేసర్ జస్ప్రీత్ బుమ్రాతో పాటు హర్షల్ పటేల్ పేరు కచ్చితంగా ఉంటుంది. కానీ, హర్షల్‌తో ఎక్కువగా మ్యాచులు ఆడిస్తే ప్రత్యర్థి ఆటగాళ్లు.. అతడు బౌలింగ్ చేసే తీరును, స్లో, యార్కర్ బంతులను సంధించే విధానాన్ని అర్థం చేసుకుంటారు. అందుకే, అతడితో ఎంత తక్కువ బౌలింగ్ చేయిస్తే.. అంత మంచిది. ఆస్ట్రేలియాలో మైదానాలు చాలా విశాలంగా ఉంటాయి. బౌలర్లకు అనుకూలంగా ఉంటాయి. అక్కడి పిచ్‌లపై హర్షల్ మెరుగ్గా రాణించగలడు. అతడు భారత జట్టులోకి అరంగేట్రం చేసినప్పటి నుంచి.. దక్కిన ప్రతి అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటూ ముందుకు సాగుతున్నాడు. వెస్టిండీస్‌తో జరిగిన మూడో టీ20 మ్యాచులో కెప్టెన్ రోహిత్ శర్మ వికెట్ అవసరమైన ప్రతి సారి హర్షల్ పటేల్‌కి బౌలింగ్ అప్పగించాడు. అయినా ఏ మాత్రం తడబాటు లేకుండా గొప్పగా రాణించి వికెట్లు పడగొట్టాడు. కెప్టెన్‌కి తనపై ఉన్న నమ్మకాన్ని నిలబెట్టుకున్నాడు. టీమిండియా విజయం సాధించడంలో కీలకంగా వ్యవహరించాడు. సీనియర్ పేసర్ జస్ప్రీత్ బుమ్రా లాగే గొప్పగా రాణించాడు. హర్షల్ వేసే స్లో డెలివరీలను ఎలా ఎదుర్కోవాలో తెలియక బ్యాటర్లు వికెట్లు సమర్పించుకుంటున్నారు. ఆ విషయం తలుచుకుంటే నాకు చాలా ఆశ్చర్యంగా అనిపిస్తుంది’ అని అజయ్ జడేజా చెప్పాడు.
ఇవీ చదవండి
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
Business News
OYO offer: ఓయోలో రూమ్స్‌పై 60 శాతం వరకు డిస్కౌంట్.. కేవలం వారికి మాత్రమే!
-
General News
Telangana News: ఇంటర్మీడియట్లో మళ్లీ పూర్తి స్థాయి సిలబస్
-
India News
Vaccines Impact: భారత్‌లో.. 42లక్షల మరణాలను నివారించిన వ్యాక్సిన్లు
-
Business News
Stock Market Update: వరుసగా రెండోరోజూ సూచీలకు లాభాలు
-
India News
Varun Gandhi: వారికి లేని పెన్షన్ నాకెందుకు..?: కేంద్రాన్ని ప్రశ్నించిన వరుణ్ గాంధీ
-
Sports News
Bizarre Dismissals: క్రికెట్లో విచిత్రమైన ఔట్లు.. వీటిపై ఓ లుక్కేయండి..!
ఎక్కువ మంది చదివినవి (Most Read)
- Google Play Store: ఫోన్లో ఈ ఐదు యాప్స్ ఉన్నాయా? వెంటనే డిలీట్ చేసుకోండి!
- Crime News: మిత్రుడి భార్యపై అత్యాచారం... తట్టుకోలేక దంపతుల ఆత్మహత్యాయత్నం
- Agnipath Protest: సికింద్రాబాద్ అల్లర్ల కేసు... గుట్టువీడిన సుబ్బారావు పాత్ర
- Team India WarmUp Match: భరత్ ఒక్కడే నిలబడ్డాడు.. విఫలమైన టాప్ఆర్డర్
- Maharashtra Crisis: రెబల్ ఎమ్మెల్యేల కోసం 7 రోజులకు 70 రూమ్‌లు.. రోజుకు ఎంత ఖర్చో తెలుసా!
- Aaditya Thackeray: అర్ధరాత్రి బయటకొచ్చిన ఆదిత్య ఠాక్రే.. తర్వాత ఏం జరిగిందంటే?
- Team India: టీమ్ఇండియా మ్యాచ్‌లో ఆసక్తికర సన్నివేశం
- Tollywood: ప్రముఖ నిర్మాత ఇంట పెళ్లి సందడి.. తరలివచ్చిన తారాలోకం
- చిత్తూరు మాజీ మేయర్ హేమలతపైకి పోలీసు జీపు!
- Samantha: సమంత వ్యూహం ఫలించిందా?