IND vs NZ: ముగ్గురు స్పిన్నర్లతో బరిలోకి దిగుతాం : న్యూజిలాండ్‌ కోచ్‌ గ్యారీ స్టెడ్‌

పిచ్‌ పరిస్థితులను బట్టి అవసరమైతే ముగ్గురు స్పిన్నర్లతో బరిలోకి సిద్ధంగా ఉన్నామని న్యూజిలాండ్‌ కోచ్‌ గ్యారీ స్టెడ్‌ అన్నాడు. నవంబరు 25 (గురువారం) నుంచి న్యూజిలాండ్‌, భారత్‌ జట్ల మధ్య..

Updated : 23 Nov 2021 15:21 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: పిచ్‌ పరిస్థితులను బట్టి అవసరమైతే ముగ్గురు స్పిన్నర్లతో బరిలోకి దిగేందుకు సిద్ధంగా ఉన్నామని న్యూజిలాండ్‌ కోచ్‌ గ్యారీ స్టెడ్‌ అన్నాడు. టెస్టు మ్యాచులు జరుగనున్న కాన్పుర్‌, వాంఖడే మైదానాలు వేటికవే ప్రత్యేకమైనవని పేర్కొన్నాడు. నవంబరు 25 (గురువారం) నుంచి న్యూజిలాండ్‌, భారత్‌ జట్ల మధ్య కాన్పుర్‌ వేదికగా తొలి టెస్టు మ్యాచ్‌ ప్రారంభం కానున్న విషయం తెలిసిందే. ఈ మ్యాచ్‌కు కెప్టెన్‌ విరాట్‌ కోహ్లి గైర్హాజరీతో.. అజింక్య రహానె కెప్టెన్‌గా వ్యవహరించనున్నాడు. 

‘ఇంతకు ముందు భారత పర్యటనకు వచ్చిన విదేశీ జట్లు ఎందుకు విఫలమయ్యాయో మేం పరిశీలించాం. అవే తప్పులను మేం చేయకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నాం. నలుగురు సీమర్లు, ఒక స్పిన్నర్‌తో బరిలోకి దిగితే ఇక్కడి పిచ్‌లపై ప్రభావం చూపలేం. ముగ్గురు స్పిన్నర్లను తుది జట్టులోకి తీసుకుంటే విజయావకాశాలు ఎక్కువగా ఉంటాయి. తొలి మ్యాచ్‌లో విజయం సాధిస్తే.. మిగతా మ్యాచుల్లో అదే సూత్రాన్ని అనుసరిస్తామని చెప్పడం సరికాదు. పిచ్‌ పరిస్థితులను బట్టి ఎప్పటికప్పుడూ వ్యూహాలను మారుస్తూనే ఉండాలి. టెస్టు క్రికెట్లోని కొన్ని మూల సూత్రాలను పాటిస్తూనే.. మా ఆట తీరులో మార్పులు చేసుకుంటాం’ అని న్యూజిలాండ్‌ కోచ్‌ గ్యారీ స్టెడ్‌ పేర్కొన్నాడు. గత కొద్ది కాలంగా విరామం లేకుండా క్రికెట్ ఆడుతున్న విరాట్‌ కోహ్లి, రోహిత్‌ శర్మ, రిషభ్‌ పంత్‌, జస్ప్రీత్ బుమ్రా, మహమ్మద్ షమిలకు టీమ్ఇండియా యాజమాన్యం విశ్రాంతినిచ్చిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో పలువురు యువ క్రికెటర్లకు జట్టులో చోటు కల్పించారు.

Read latest Sports News and Telugu News

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని