కోహ్లీని ఔట్ చేసే వ్యూహమదే: ఇంగ్లాండ్‌

భారత్‌లో భారత్‌తో సిరీస్‌ అంటే అత్యంత కఠిన సవాలని ఇంగ్లాండ్‌ బ్యాటింగ్ కోచ్‌ గ్రహమ్‌ థోర్‌పె అన్నాడు. టీమిండియా అత్యుత్తమ క్రికెట్ ఆడుతుందని, అంతేగాక కంగారూల గడ్డపై ఆస్ట్రేలియాని చిత్తుచేసి....

Published : 30 Jan 2021 00:36 IST

ఇంటర్నెట్‌డెస్క్: భారత్‌లో భారత్‌తో సిరీస్‌ అంటే అత్యంత కఠిన సవాల్‌ అని ఇంగ్లాండ్‌ బ్యాటింగ్ కోచ్‌ గ్రహమ్‌ థోర్‌పె అన్నాడు. టీమిండియా అత్యుత్తమ క్రికెట్ ఆడుతుందని, అంతేగాక కంగారూల గడ్డపై ఆస్ట్రేలియాని చిత్తుచేసి మరింత ఆత్మవిశ్వాసంతో ఉందని అన్నాడు. కోహ్లీ సేనలో బ్యాట్స్‌మెన్‌ అంతా మంచి ఫామ్‌లో ఉన్నారని, ముఖ్యంగా కెప్టెన్‌ విరాట్ కోహ్లీని ఔట్ చేయడం అంత తేలిక కాదని పేర్కొన్నాడు.

‘‘కోహ్లీ అత్యుత్తమ ఆటగాడని అందరికీ తెలుసు. గత కొన్నేళ్లుగా అతడు అద్భుత ప్రదర్శనలు చేస్తున్నాడు. సొంతగడ్డపై ఎలా ఆడాలో అతడికి బాగా తెలుసు. అయితే అతడిని ఎదుర్కోవాలంటే మా బౌలింగ్ దళం అత్యుత్తమ బంతుల్నే విసరాలి. స్పిన్నర్లు, పేసర్లు అదే చేయాలి. టీమిండియా బ్యాట్స్‌మెన్‌పై ఒత్తిడి తెచ్చేలా బౌలింగ్‌ చేయాలి. ఇక టీమిండియా బౌలింగ్ విషయానికొస్తే.. స్పిన్‌తో పాటు పేస్‌ దళం పటిష్టంగా ఉంది. ఉప ఖండానికి వచ్చినప్పుడు స్పిన్‌ను ఎంతో జాగ్రత్తగా ఎదుర్కోవాలి’’ అని గ్రహమ్‌ తెలిపాడు.

‘‘మా జట్టులో కొందరికి ఇక్కడ ఆడిన అనుభవం లేదు. అయితే వాళ్లు ఎంతో శ్రమిస్తున్నారు. మంచి ప్రదర్శనలు ఇవ్వాలని పట్టుదలతో ఉన్నారు. మా వద్ద దూకుడుగా ఆడే ఆటగాళ్లతో పాటు నిదానంగా రోజంతా ఆడే సామర్థ్యం ఉన్న ఆటగాళ్లు ఉన్నారు. అయితే పరిస్థితులకు తగ్గట్లుగా వాళ్లు చక్కని ప్రదర్శన చేయాలి. భారత బౌలర్లపై ఒత్తిడి తీసుకురావాలి. ఇది సవాలే’’ అని గ్రహమ్‌ పేర్కొన్నాడు. ఫిబ్రవరి 5నుంచి భారత్‌తో ఇంగ్లాండ్ నాలుగు టెస్టుల సిరీస్‌ ఆడనుంది. తొలి రెండు టెస్టులు చెన్నై వేదికగా జరగనున్నాయి.

ఇవీ చదవండి

సంకల్పం ఉంటే ఏదైనా చేయొచ్చు: కోహ్లీ

వారెవ్వా..సూపర్‌మ్యాన్‌ క్యాచ్‌ ఇది!

Read latest Sports News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram & Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts