Sania Mirza: వెల్‌డన్ ఛాంప్.. యువరాజ్ సింగ్ స్పెషల్ పోస్ట్
భారత టెన్నిస్ దిగ్గజం (Team India) సానియా మీర్జా (Sania Mirza) తన చివరి గ్రాండ్‌స్లామ్‌ను ఆడుతోంది. రోహన్ బొపన్న (Rohan Bopanna) ఆస్ట్రేలియన్ ఓపెన్ (Australian Open)తో కలిసి సానియా మిక్స్‌డ్ డబుల్స్ ఫైనల్‌కు చేరింది.
ఇంటర్నెట్ డెస్క్: చివరి గ్రాండ్‌స్లామ్ ఆడుతోన్న భారత టెన్నిస్ దిగ్గజం సానియా మీర్జా ఆస్ట్రేలియన్ ఓపెన్ 2023 ఫైనల్‌కు చేరింది. మిక్స్‌డ్ డబుల్స్ విభాగంలో రోహన్ బొపన్నతో కలిసి బరిలోకి దిగిన సానియా మీర్జా తుదిపోరుకు అర్హత సాధించిన విషయం తెలిసిందే. దీంతో సానియా జోడీకి ప్రశంసలు వస్తున్నాయి. టీమ్‌ఇండియా మాజీ క్రికెటర్ యువరాజ్ సింగ్ కూడా ప్రత్యేకంగా అభినందనలు తెలిపాడు. ‘‘వెల్‌డన్ ఛాంప్.. మీలోని మరో పార్శం చూస్తున్నాం. మళ్లీ కలుద్దాం’’ అని పోస్టు చేశాడు.
ఆస్ట్రేలియన్ ఓపెన్ మిక్స్‌డ్ డబుల్స్‌లో సానియా జోడీ ఫైనల్ చేరడమిది అయిదో సారి. భూపతితో కలిసి 2009లో ఆమె ట్రోఫీ గెలిచింది. ఇప్పుడు మరోసారి తన చివరి గ్రాండ్‌స్లామ్‌లో ఆడుతూ ఫైనల్‌కు చేరుకోవడం విశేషం. దీంతో బోపన్నతో కలిసి టైటిల్‌ను నెగ్గి టెన్నిస్ కెరీర్‌కు ముగింపు పలకాలని భావిస్తోంది. ఫైనల్‌లో (జనవరి 27) బ్రెజిల్‌కు చెందిన జోడీతో సానియా - బొపన్న తలపడతారు. దాదాపు 20 ఏళ్ల కిందట ప్రొఫెషనల్ టెన్నిస్ క్రీడాకారిణిగా మారిన సానియా భారత్ గర్వించే విధంగా రాణించింది. ఆస్ట్రేలియన్ ఓపెన్ 2023 సెమీస్‌లో గెలిచిన తర్వాత తన కుమారుడిని ముద్దాడిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
ఇవీ చదవండి
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
World News
Russia: ‘పుతిన్‌ను అరెస్టు చేయడమంటే.. యుద్ధాన్ని ప్రకటించినట్లే!’
-
India News
Anand Mahindra: తోలుబొమ్మ ‘నాటు నాటు’.. ఆనంద్ మహీంద్రా పోస్ట్ వైరల్
-
Sports News
Rohit - Gavaskar: ప్రపంచకప్ ముంగిట కుటుంబ బాధ్యతలా? రోహిత్ తీరుపై గావస్కర్ అసహనం
-
Crime News
Acid Attack: ప్రియుడితో వెళ్లిపోయిందని.. కోర్టులోనే భార్యపై యాసిడ్ దాడి!
-
Movies News
Srikanth: విడాకుల రూమర్స్.. భార్యతో కలిసి వెళ్లాల్సి వస్తోంది: శ్రీకాంత్
-
Politics News
Panchumarthi Anuradha: అప్పుడు 26ఏళ్లకే మేయర్.. ఇప్పుడు తెదేపా ఎమ్మెల్సీ!