Yuvraj : కోట్లొస్తుంటే టెస్టులెందుకు ఆడతారు

టీ20 క్రికెట్‌ ఆడడం ద్వారా ఇప్పుడు కుర్రాళ్లు ఏడాదికి కోట్లు సంపాదిస్తుంటే టెస్టులపై ఎందుకు ఆసక్తి చూపిస్తారని భారత మాజీ స్టార్‌ యువరాజ్‌ సింగ్‌ ప్రశ్నించాడు. ‘‘టెస్టు క్రికెట్‌ చచ్చిపోతుంది. ఎందుకంటే జనం టీ20 క్రికెట్‌ కావాలనుకుంటున్నారు.

Updated : 11 May 2022 07:34 IST

ముంబయి: టీ20 క్రికెట్‌ ఆడడం ద్వారా ఇప్పుడు కుర్రాళ్లు ఏడాదికి కోట్లు సంపాదిస్తుంటే టెస్టులపై ఎందుకు ఆసక్తి చూపిస్తారని భారత మాజీ స్టార్‌ యువరాజ్‌ సింగ్‌ ప్రశ్నించాడు. ‘‘టెస్టు క్రికెట్‌ చచ్చిపోతుంది. ఎందుకంటే జనం టీ20 క్రికెట్‌ కావాలనుకుంటున్నారు.. టీ20లనే చూడాలని అనుకుంటున్నారు. ఇలాంటి స్థితిలో ఏ ఆటగాడైనా అయిదు లక్షల కోసం అయిదురోజుల క్రికెట్‌ ఆడాలని అనుకోరు కదా. అదే టీ20లు ఆడితే కనీసం 50 లక్షలు సంపాదిస్తున్నారు. అంతర్జాతీయ క్రికెట్లో అరంగేట్రం చేయని కుర్రాళ్లు కూడా ఐపీఎల్‌ ద్వారా 7-10 కోట్ల మధ్య ఆర్జిస్తున్నారు. టీ20 క్రికెట్‌ మ్యాచ్‌ను చూసిన కళ్లతో వన్డేను చూస్తే టెస్టు చూసినట్లే ఉంటుంది. 20 ఓవర్లు గడిచాక ఇంకా 30 ఓవర్లు బ్యాటింగ్‌ చేయాలా అని అనిపిస్తుంది. టీ20లదే హవా అని చెప్పడానికి ఇదొక్కటే ఉదాహరణ’’ అని యువీ చెప్పాడు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని