
Yuvraj singh: యువీ అరెస్ట్.. బెయిల్‌పై విడుదల
చండీగఢ్: మాజీ క్రికెటర్ యువరాజ్ సింగ్‌ను హరియాణా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. గత సంవత్సరం జరిగిన లైవ్ చాట్‌లో ఓ వర్గం వారిని కించపరుస్తూ వ్యాఖ్యలు చేశాడనే కేసు నమోదు నేపథ్యంలో అరెస్ట్ చేశారు. గతేడాది రోహిత్ శర్మతో జరిగిన లైవ్ చాటింగ్‌లో క్రికెటర్ యుజ్వేంద్ర చాహల్‌ను ఉద్దేశించి అభ్యంతరకర వ్యాఖ్యలు చేసినట్లు పోలీసులకు ఫిర్యాదు అందింది. ఈ మేరకు ఈ ఫిబ్రవరిలో హరియాణాలోని హన్సి నగర పోలీస్‌స్టేషన్‌లో కేసు నమోదైంది. ఈ కేసులో ఇవాళ యువీని హిస్సార్ జిల్లా పోలీసులు అరెస్ట్ చేశారు. హైకోర్టు ఆదేశాల మేరకు అరెస్ట్ అయిన కాసేపటికి యువీ విడుదలయ్యాడు. గతంలోనే ఈ విషయంపై యువీ క్షమాపణలు చెప్పడం గమనార్హం.
ఇవీ చదవండి
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.