Yuvraj Singh: రోహిత్‌కు టీమ్‌ఇండియా కెప్టెన్సీ ముందే ఇవ్వాల్సింది: యువరాజ్

ముంబయి కెప్టెన్‌ రోహిత్‌ శర్మకు టీమ్‌ఇండియా పరిమిత ఓవర్ల కెప్టెన్సీ బాధ్యతలు ముందే అప్పగించాల్సిందని మాజీ ఆల్‌రౌండర్‌ యువరాజ్‌ సింగ్‌ అభిప్రాయపడ్డాడు...

Published : 30 Apr 2022 17:58 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: ముంబయి కెప్టెన్‌ రోహిత్‌ శర్మకు టీమ్‌ఇండియా పరిమిత ఓవర్ల కెప్టెన్సీ బాధ్యతలు ముందే అప్పగించాల్సిందని మాజీ ఆల్‌రౌండర్‌ యువరాజ్‌ సింగ్‌ అభిప్రాయపడ్డాడు. అతడు మేటి సారథి అని, ఆటలో సరైన నిర్ణయాలు తీసుకుంటాడని మెచ్చుకున్నాడు. అయితే, విరాట్‌ కోహ్లీ భారత జట్టును అద్భుతంగా నడిపించడంతో రోహిత్‌కు ఆ అవకాశం రాలేదని చెప్పాడు. తాజాగా ఓ జాతీయ మీడియాతో మాట్లాడిన యువీ ఈ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. అలాగే ఈ ఏడాది ఆరంభంలో దక్షిణాఫ్రికా పర్యటన అనంతరం కోహ్లీ  టెస్టు సారథ్య బాధ్యతల నుంచి తప్పుకొన్నాక రోహిత్‌ను కొత్త సారథిగా నియమిస్తూ తీసుకున్న నిర్ణయం భావోద్వేగభరితమైనదని పేర్కొన్నాడు.

రోహిత్‌కు శుభాకాంక్షల వెల్లువ..

మరోవైపు హిట్‌మ్యాన్‌ ఈరోజు 35వ వసంతంలోకి అడుగుపెట్టడంతో అతడికి జన్మదిన శుభాకాంక్షలు వెల్లువెత్తాయి. అతడి సతీమణి రితికతో పాటు ముంబయి టీమ్‌, ఇతర ఫ్రాంఛైజీలు, అభిమానులు, తోటి ఆటగాళ్లంతా సామాజిక మాధ్యమాల్లో విషెస్‌ చెప్పారు. యువరాజ్‌ సైతం రోహిత్‌కు ప్రత్యేకమైన శుభాకాంక్షలు తెలిపాడు.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని