Yuvraj Singh: ఆ హైదరాబాద్‌ బ్యాట్స్‌మన్‌ నన్నే గుర్తుచేస్తున్నాడు: యువీ

హైదరాబాద్‌ యువ బ్యాట్స్‌మన్‌ అభిషేక్‌ శర్మ తన ఆటను గుర్తుకు తెస్తున్నాడని టీమ్‌ఇండియా మాజీ ఆల్‌రౌండర్‌ యువరాజ్‌ సింగ్‌ పేర్కొన్నాడు...

Published : 08 May 2022 10:18 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: హైదరాబాద్‌ యువ బ్యాట్స్‌మన్‌ అభిషేక్‌ శర్మ తన ఆటను గుర్తుకు తెస్తున్నాడని టీమ్‌ఇండియా మాజీ ఆల్‌రౌండర్‌ యువరాజ్‌ సింగ్‌ పేర్కొన్నాడు. తాజాగా ఓ జాతీయ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో యువీ పలు ఆసక్తికర విశేషాలు పంచుకున్నాడు. 2004లో ముల్తాన్‌ టెస్టులో సచిన్‌ (194*) పరుగుల వద్ద ఉండగా టీమ్‌ఇండియా ఇన్నింగ్స్‌ డిక్లేర్డ్‌ చేయడం దగ్గరి నాటి నుంచి గంగూలీ రిటైరయ్యాక తనకు టెస్టుల్లో అవకాశాలు వచ్చిన అనేక విషయాలను వెల్లడించాడు. ఈ క్రమంలోనే ప్రస్తుతం జరుగుతోన్న టీ20లీగ్‌ 15వ సీజన్‌లో హైదరాబాద్‌ ఓపెనర్‌ అభిషేక్‌ శర్మ అచ్చం తనలాగే షాట్లు ఆడుతున్నాడని చెప్పాడు.

‘అభిషేక్‌ శర్మను చూస్తుంటే చాలా మటుకు నన్నే గుర్తుకు తెస్తున్నాడు. అతనాడే పుల్‌ షాట్లు‌, బ్యాక్‌ఫుట్‌ షాట్లు అచ్చం నేనాడే విధంగానే ఉన్నాయి. చెన్నై జట్టులోని శివమ్‌ దూబే కూడా ఇలాగే ఆడుతున్నాడు. కానీ, అతడు చాలా రోజులుగా క్రికెట్‌ ఆడుతున్నా ఇప్పటివరకు ఎన్ని వన్డేలు ఆడాడో నాకు తెలియదు. నైపుణ్యాలున్న ఆటగాళ్లకు ఎక్కువ అవకాశాలిచ్చి ప్రోత్సహించాలి. దాంతో వారు అత్యుత్తమ క్రికెటర్లుగా తయారవుతారు’ అని యువీ చెప్పుకొచ్చాడు. కాగా, ఈ సీజన్‌లో అభిషేక్ ఆడిన 10 మ్యాచ్‌ల్లో 331 పరుగులు చేయగా.. సగటు 33.10, 134 స్ట్రైక్‌రేట్‌ కలిగి ఉన్నాడు. అలాగే శివమ్‌ దూబే ఆడిన 8 మ్యాచ్‌ల్లో 247 పరుగులు చేయగా.. సగటు 35.29, స్ట్రైక్‌రేట్‌ 159.35 సాధించాడు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని