Yuvraj Singh: యువరాజ్‌ సింగ్‌ మెడలో భారీ కొండ చిలువ! 

పులి, సింహం కలయికతో జన్మించిన ‘లైగర్‌’తో యువరాజ్‌సింగ్‌ టగ్‌ ఆఫ్‌ వార్‌ ఆడాడు. తాడును ఒకవైపు లైగర్‌ నోటితో పట్టుకొని ఉండగా.. యువీతోపాటు మరో నలుగురు ఆ తాడును లాగారు.....

Published : 04 Oct 2021 01:09 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: భారత మాజీ క్రికెటర్‌, 2011 ప్రపంచకప్‌ హీరో యువరాజ్‌సింగ్‌ ప్రస్తుతం దుబాయ్‌లో విహరిస్తున్నాడు. అక్కడి ప్రముఖ ప్రాంతాలను సందర్శిస్తున్నాడు. ఈ నేపథ్యంలోనే దుబాయ్‌లో ప్రసిద్ధి గాంచిన ‘ఫేమ్‌ పార్క్‌’లో స్నేహితులతో సరదాగా గడిపాడు.  ‘లైగర్‌’తో టగ్‌ ఆఫ్‌ వార్‌ ఆడాడు. తాడును ఒకవైపు లైగర్‌ నోటితో పట్టుకొని ఉండగా.. యువీతోపాటు మరో నలుగురు ఆ తాడును లాగారు. అయినప్పటికీ లైగర్‌ ఏమాత్రం పడలకుండా అలాగే నిలబడి ఉండటం విశేషం. చింపాంజీ, ఎలుగుబంటి, జిరాఫీలతోపాటు మరికొన్ని జంతువులకు కూడా యువీ స్వయంగా ఆహారాన్ని అందించాడు. లైగర్‌కు మాంసాన్ని తినిపించాడు. అనంతరం ఓ భారీ కొండచిలువను మెడలో వేసుకొని మురిసిపోయాడు.

ఇందుకు సంబంధించిన ఓ వీడియోను యువరాజ్‌ ఇస్టాగ్రామ్‌ వేదికగా పంచుకున్నాడు. ‘టైగర్‌ vs లైగర్‌. చివరకు ఏమవుతుందో మీకు తెలుసు. ఇదో గొప్ప అనుభూతి. నా భయాలను అధిగమిస్తూ, అడవి అందాలను ఆస్వాదించా’ అంటూ ఆ వీడియోకు తన వ్యాఖ్యలను జోడించాడు. జంతువులను సురక్షితంగా చూసుకుంటున్న ఫేమ్‌ పార్క్‌ యాజమాన్యాన్ని యువీ కొనియాడాడు. ‘ఫేమ్‌ పార్క్‌ స్వర్గధామంలా ఉంది. జంతువులన్నీ సురక్షిత స్థలంలో జీవిస్తున్నాయి. సంరక్షకులు వాటి అవసరాలను చూసుకోవడానికి చాలా బాగా శిక్షణ పొందారు. ఈ వీడియో తీసే సమయంలో జంతువులకు ఎలాంటి హాని జరగలేదు’ అంటూ పోస్టు చేశాడు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని