IND vs WI: బుమ్రా రికార్డును చాహల్‌ బద్ధలు కొడతాడా?

భారత స్పిన్నర్‌ యుజువేంద్ర చాహల్‌ టీ20ల్లో ఓ రికార్డుని సృష్టించేందుకు వికెట్‌ దూరంలో ఉన్నాడు. చాహల్‌ మరో వికెట్‌ పడగొడితే పొట్టి ఫార్మాట్‌లో అత్యధిక వికెట్లు తీసిన భారత బౌలర్‌గా నిలుస్తాడు. ప్రస్తుతం

Published : 20 Feb 2022 01:57 IST

ఇంటర్నెట్ డెస్క్: భారత స్పిన్నర్‌ యుజువేంద్ర చాహల్‌ టీ20ల్లో ఓ రికార్డుని సృష్టించేందుకు వికెట్‌ దూరంలో ఉన్నాడు. మరో వికెట్‌ పడగొడితే పొట్టి ఫార్మాట్‌లో అత్యధిక వికెట్లు తీసిన భారత బౌలర్‌గా నిలుస్తాడు. ప్రస్తుతం టీమ్‌ఇండియా పేసుగుర్రం జస్ప్రీత్ బుమ్రా (66 వికెట్లు 55 మ్యాచ్‌ల్లో), చాహల్‌ (66 వికెట్లు 52 మ్యాచ్‌ల్లో) సమానంగా ఉన్నారు. ఈడెన్ గార్డెన్స్‌లో ఆదివారం జరిగే మూడో (చివరి) టీ20లో వెస్టిండీస్‌తో టీమ్‌ఇండియా తలపడనుంది. ఈ మ్యాచ్‌లో చాహల్‌ ఒక్కవికెట్‌ పడగొట్టినా అత్యధిక వికెట్లు తీసిన భారత బౌలర్‌గా అవతరిస్తాడు. ఈ సిరీస్‌లో బుమ్రా ఆడటం లేదు.

మరోవైపు పరిమిత ఓవర్ల ఫార్మాట్‌లో రోహిత్‌ శర్మ కెప్టెన్సీలో టీమ్‌ఇండియా వరుస విజయాలతో దూసుకుపోతోంది. వెస్టిండీస్‌తో జరిగిన మూడు వన్డే మ్యాచ్‌ల సిరీస్‌ని భారత్‌.. 3-0 తేడాతో కైవసం చేసుకుని కరేబియన్‌ జట్టును వైట్‌వాష్‌ చేసింది. టీ20 సిరీస్‌లో కూడా భారత జట్టు అదే జోరును కొనసాగిస్తోంది. మూడు టీ20ల సిరీస్‌లో ఇప్పటికే రెండు మ్యాచ్‌ల్లో విజయం సాధించి సిరీస్‌ని చేజిక్కించుకున్న రోహిత్‌ సేన.. ఆదివారం జరగనున్న ఆఖరి (మూడో) టీ20లోనూ గెలుపొంది మరోసారి విండీస్‌ను వైట్‌వాష్‌ చేయాలని తహతహలాడుతోంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని