ఆర్సీబీ జెర్సీలో చాహల్ భార్య స్టెప్పులు

టీమ్‌ ఇండియా స్పిన్నర్‌, ఆర్సీబీ ఆటగాడు యుజువేంద్ర చాహల్  సామాజిక మాధ్యమాల్లో ఎంత హుషారుగా ఉంటాడో.. అతని సతీమణి ధనశ్రీ వర్మ సైతం అంతే ఉత్సాహంతో సోషల్‌ మీడియాలో తన వీడియోలను పోస్టు చేస్తూ అభిమానులను ఎంటర్‌టైన్‌ చేస్తుంటుంది. ఇక ఐపీఎల్‌ 14వ సీజన్‌ కరోనా

Updated : 20 Sep 2022 15:27 IST

            

                           (photo: Yuzvendra Chahal Twitter)                        

ఇంటర్నెట్‌ డెస్క్‌: టీమ్‌ ఇండియా స్పిన్నర్‌, ఆర్సీబీ ఆటగాడు యుజువేంద్ర చాహల్  సామాజిక మాధ్యమాల్లో ఎంత హుషారుగా ఉంటాడో.. అతని సతీమణి ధనశ్రీ వర్మ సైతం అంతే ఉత్సాహంతో సోషల్‌ మీడియాలో తన వీడియోలను పోస్టు చేస్తూ అభిమానులను ఎంటర్‌టైన్‌ చేస్తుంటుంది. ఇక ఐపీఎల్‌ 14వ సీజన్‌ కరోనా రెండో వేవ్‌తో రద్దవ్వడంతో అభిమానులతో పాటు ఆటగాళ్లు తీవ్రనిరాశకు గురయ్యారు. దీంతో ఆటగాళ్లు కూడా సామాజిక మధ్యమాల్లో తరుచూ వీడియోలు చేస్తూ తమ అభిమానులను అలరిస్తున్నారు.  కొరియోగ్రఫర్‌, యూట్యూబర్‌గా ఫేమస్‌ అయిన ధనశ్రీ తాజాగా ఆర్సీబీ జెర్సీ ధరించి ప్రఖ్యాత అమెరికన్ ర్యాపర్‌ సౌలిజా బాయ్స్‌ రూపొందించిన ‘షి మేక్‌ ఇట్‌ క్లాప్‌’ అనే పాటకు స్టెప్పులేసింది. ఈ వీడియోను ఇన్‌స్టాలో పోస్టు చేసింది. ఈ వీడియోకి రెండు గంటల్లోనే రెండు లక్షలకుపైగా వ్యూస్ వచ్చాయి. ఈ వీడియోని మీరు కూడా చూసేయండి మరి! 


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని