FIFA: ఎప్పుడు ముందుండి నడిపించాలో తెలిసిన కెప్టెన్..!
1998 ప్రపంచకప్‌ను కెప్టెన్ జిదానే కేవలం తన హెడర్ షాట్లతోనే ఫ్రాన్స్‌కు అందించాడు. ఫైనల్స్‌లో డిఫెండింగ్ ఛాంపియన్‌కు ఊపిరాడనీయలేదు.
ఇంటర్నెట్‌డెస్క్: కెప్టెన్‌గా ఎప్పుడు ముందుండి జట్టును నడిపించాలో ప్రపంచానికి చూపించాడు ఫ్రాన్స్ ఆటగాడు జినెడిన్ జిదానే. 1998 ప్రపంచకప్ టోర్నీకి ఫ్రాన్స్ ఆతిథ్యం ఇచ్చింది. అప్పటికే ఈ టోర్నీలకు ఆతిథ్యమిచ్చిన ఉరుగ్వే, ఇటలీ, ఇంగ్లాండ్, వెస్ట్ జర్మనీ, అర్జెంటీనా జట్లు సొంతగడ్డపై ఛాంపియన్లుగా అవతరించాయి. ఈ నేపథ్యంలో ఎలాగైనా కప్‌ను ఒడిసిపట్టాలని ఫ్రాన్స్ ఆటగాళ్లు నిర్ణయించుకొన్నారు. లీగ్ దశ నుంచి ఫైనల్స్ వరకు ఒక్క మ్యాచ్‌లో కూడా ఓటమి అనేదే లేకుండా ముందుకు సాగారు. కెప్టెన్ జిదానే జట్టును సమన్వయం చేసుకొంటూ విజయపథంలో నడిపించాడు. అయితే.. టోర్నీలో అతడు అప్పటి వరకు ఒక్కగోల్ కూడా ( క్వార్టర్ ఫైనల్స్‌లో ఇటలీపై పెనాల్టీ షూట్లో మినహా) చేయకపోవడం గమనార్హం.
ఇక మరోవైపు డిఫెండింగ్ ఛాంపియన్ బ్రెజిల్ కూడా ఫైనల్స్ చేరుకొంది. బెబెటో, రొనాల్డో, రివాల్డో, కాఫు, కార్లోస్, లియోనార్డో వంటి స్టార్ ఆటగాళ్లతో ఆ జట్టు బలంగా ఉంది. 1994 ప్రపంచ విజేత కూడా. రొనాల్డో అప్పటికే టోర్నీలో 4 గోల్స్ చేసి మంచి ఫామ్‌లో ఉన్నాడు. ఇక ఫ్రాన్స్ తరఫున లిలియాన్ మాత్రమే ఆ టోర్నీలో అప్పటి వరకు జట్టులో అత్యధికంగా రెండు గోల్స్ చేశాడు. కాకపోతే జట్టులో దాదాపు ఏడుగురు ఆటగాళ్లు కనీసం ఒక్క గోలైనా చేశారు. అంటే సమష్టిగా రాణిస్తున్నారని అర్థం.
ఇక ఫైనల్లో దిగ్గజ బ్రెజిల్‌ను ఢీకొనేందుకు ఫ్రాన్స్ జట్టును జిదానే ముందుండి నడిపించాడు. తమ గోల్‌పోస్ట్‌ను ఫ్రాన్స్ ఆటగాళ్లు డిఫెన్స్‌తో దుర్బేధ్యంగా మార్చేశారు. బ్రెజిల్ స్ట్రైకర్లు చేసిన దాడులను తిప్పికొట్టారు. మ్యాచ్ 27వ నిమిషంలో ఫ్రాన్స్‌కు పెనాల్టీ కార్నర్ లభించింది. అద్భుతమైన హెడర్ షాట్‌తో దానిని జిదానే గోల్‌గా మలిచాడు. మ్యాచ్ తొలి అర్ధభాగం ముగియడానికి నిమిషం ముందు ఫ్రాన్స్‌కు మరో పెనాల్టీ కార్నర్ లభించింది. ఫ్రాన్స్ ఆటగాడు యారీ రఫీ జోర్కేఫ్ కొట్టిన షాట్‌ను మళ్లీ జిదానే తన హెడర్‌తో గోల్‌గా మలిచాడు. ఈ మ్యాచ్‌లో జిదానే చేసిన రెండు గోల్స్ హెడర్ షాట్లతో రావడం విశేషం. ఆ తర్వాత బ్రెజిల్ ఏ దశలోనూ ఫ్రాన్స్ రక్షణ వలయాన్ని ఛేదించలేకపోయింది. మ్యాచ్ చివరి నిమిషంలో లిలియాన్ మరో గోల్ చేయడంతో ఫ్రాన్స్ విజయం సంపూర్ణమైంది. స్టార్లతో నిండిన బ్రెజిల్ ఈ మ్యాచ్‌లో ఒక్క గోల్ కూడా చేయలేకపోయింది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
30 ఏళ్ల క్రితం సచిన్ ఆట మొదలైంది ఈ రోజే..!
సరిగ్గా ఇదే రోజు.. 30 ఏళ్ల క్రితం (మార్చి 27, 1994) మాస్టర్ బ్లాస్టర్ సచిన్ తెందూల్కర్ కెరీర్ మలుపు తిరిగింది. -
ఫినిషర్ మళ్లీ వచ్చాడు.. ఈసారి బెంగళూరును గెలిపించాడు..
ఐపీఎల్ 17 సీజన్లో భాగంగా పంజాబ్‌తో జరిగిన మ్యాచ్‌లో దినేశ్ కార్తిక్ (Dinesh Karthik) ఫినిషింగ్ టచ్ ఇచ్చి బెంగళూరును గెలిపించాడు. -
Bengaluru Vs Punjab: సొంత మైదానంలో విజయం.. ఆనవాయితీని బెంగళూరు కొనసాగించేనా?
ఐపీఎల్లో బెంగళూరు రెండో మ్యాచ్ ఆడేందుకు సిద్ధమైంది. చిన్నస్వామి స్టేడియం వేదికగా పంజాబ్‌తో తలపడనుంది. -
Mumbai Indians: వరుసగా 12వ సారి.. ముంబయి తొలి మ్యాచ్‌ల చరిత్ర ఎలా ఉందంటే..?
ఈ సీజన్లో ముంబయి ఇండియన్స్ ఆడిన తొలి మ్యాచ్‌లో గుజరాత్‌పై ఓటమిపాలైంది. ఇలా ఓటమితో సీజన్‌ను ప్రారంభించడం ఆ జట్టుకు కొత్తేమీ కాదు. -
IPL 2024: హోస్ట్ టీమే విన్నర్.. ‘ఫస్ట్’ బెస్ట్ వీరే!
ఐపీఎల్ 17వ సీజన్లో మ్యాచ్‌లు రసవత్తరంగా సాగుతున్నాయి. ఐదు మ్యాచుల్లో నాలుగు చివరి ఓవర్ వరకూ వెళ్లాయి.. -
Gujarat Vs Mumbai: పాత జట్టే పాండ్య ప్రత్యర్థి.. ‘నాన్-కెప్టెన్’ రోహిత్ ఏం చేస్తాడో?
ఐపీఎల్లో మరో ఆసక్తికరమైన మ్యాచ్ ఇవాళ జరగనుంది. రాత్రి 7 గంటలకు ముంబయి, గుజరాత్ జట్లు అహ్మదాబాద్ వేదికగా తలపడనున్నాయి. -
Rajasthan vs Lucknow: లఖ్‌నవూతో మ్యాచ్.. యశస్వి జైస్వాల్ దూకుడు కొనసాగేనా?
సూపర్ సండేలో నేడు రెండు మ్యాచ్‌లు జరగనున్నాయి. తొలుత రాజస్థాన్ - లఖ్‌నవూ జట్లు జయపుర వేదికగా తలపడనున్నాయి. -
Cricket News: ఈసారైనా.. టైటిల్ కల నెరవేరేనా?
ఇప్పుడు ఐపీఎల్ 17వ సీజన్ కొనసాగుతోంది. తొలి ఎడిషన్ నుంచి ఆడుతున్న మూడు జట్లు మాత్రం ఒక్కసారి కూడా టైటిల్‌ను ముద్దాడలేకపోయాయి. -
Pat Cummins: కెప్టెన్ మారాడు.. హైదరాబాద్ కథ మారేనా?
కెప్టెన్ మార్పు జట్టు రాతను మారుస్తుందా? ఈ సీజన్లో సన్‌రైజర్స్ కథ సరికొత్తగా మొదలవుతుందా? నేడు కోల్‌కతాతో ఈడెన్ గార్డెన్స్ వేదికగా మ్యాచ్ జరగనుంది. -
CSK vs RCB: ధోనీ పాత్ర ఏంటి..? ఆర్సీబీ వ్యూహమేంటి?
చెపాక్ వేదికగా సీఎస్కే-ఆర్సీబీ (CSK vs RCB) జట్ల మధ్య ఐపీఎల్ 17వ సీజన్ తొలి మ్యాచ్ జరగనుంది. -
IPL 2024: ఐపీఎల్లో ఎవరు బెస్ట్..? ఎందుకు?.. ‘గూగుల్ జెమిని’ ఏం చెప్పిందంటే?
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL) అత్యుత్తమ ప్లేయర్ల జాబితాను తీస్తే కొందరు ఉంటారు. అయితే.. గూగుల్ జెమిని ఏం చెప్పిందో తెలుసుకోండి.. -
IPL: ఐపీఎల్లో ఇప్పటివరకు బ్రేక్ కాని రికార్డులు
ఐపీఎల్ (IPL) 2024 సీజన్‌కు మార్చి 22న తెర లేవనుంది. ఈ లీగ్‌లో ఇప్పట్లో బ్రేక్ కావడానికి అవకాశం లేని రికార్డులు కొన్ని ఉన్నాయి. అవేంటో చూసేద్దాం రండి. -
IPL 2024: ఓవర్లో రెండు బౌన్సర్లు.. కొత్త నిబంధనలతో సరికొత్తగా ఐపీఎల్
ఐపీఎల్ 17వ సీజన్‌ను (IPL 2024) మరింత రసవత్తరంగా మార్చేందుకు నిర్వాహకులు కొత్త నిబంధనలను తీసుకొచ్చారు. మార్చి 22 నుంచి సీఎస్కే, ఆర్సీబీ జట్ల మధ్య తొలి మ్యాచ్‌తో ఈ ఎడిషన్ ప్రారంభం కానుంది. -
IPL 2024: ఐపీఎల్ టాప్ హీరోలు.. ఈ రికార్డులకు చేరువగా!
ఐపీఎల్ (IPL) సందడి మొదలుకానుంది. అభిమానులకు క్రికెట్ మజాతోపాటు క్రికెటర్లు తమ వ్యక్తిగత రికార్డులను మెరుగుపర్చుకునేందుకు ఈ టోర్నీ కీలకంగా మారనుంది. -
IPL 2024: అందరి కళ్లూ వీరి పైనే.. ‘అన్క్యాప్డ్ ప్లేయర్ల’కు అవకాశం ఇస్తారా?
జాతీయ జట్టుకు ప్రాతినిధ్యం వహించకుండానే.. భారీ మొత్తం దక్కించుకున్న ఆటగాళ్లు ఐపీఎల్లో ఎలా ఆడతారనే దానిపై సర్వత్రా ఆసక్తి ఉండటం సహజం. అలాంటి వారిలో టాప్ ఎవరంటే? -
IPL 2023 Rewind: గత సీజన్ ఐపీఎల్ హీరోలు.. లిస్ట్‌లో ఎవరున్నారంటే?
-
Mumbai Indians: హార్దిక్.. అంత వీజీ కాదు
గత రెండు సీజన్లలో గుజరాత్ టైటాన్స్‌కు కెప్టెన్‌గా ఉన్న హార్దిక్ పాండ్య (Hardik Pandya) తిరిగి ముంబయి ఇండియన్స్‌కు చేరుకుని కెప్టెన్సీ పగ్గాలు అందుకున్నాడు. -
RCB: అమ్మాయిలు గెలిచారు.. ఇక వారి వంతు.. ఐపీఎల్లో ఏం చేస్తారో?
రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుకు ఈ ఏడాది శుభారంభం చేసింది. మహిళల ప్రీమియర్ లీగ్ (WPL) విజేతగా నిలిచి అదరగొట్టేసింది. -
Rishabh Pant: రిషభ్ పంత్ పటాకా పేలుతుందా?
టీ20లైనా, వన్డేలైనా, టెస్టులైనా.. ఫార్మాట్‌తో సంబంధం లేకుండా విధ్వంసకర బ్యాటింగ్‌తో అలరించే రిషభ్ పంత్ (Rihabh Pant) మైదానంలోకి దిగేందుకు సిద్ధమవుతున్నాడు. -
Virat Kohli: విరాట్ ఎదుట ఒక టోర్నీ.. టార్గెట్లు చాలా!
తన బ్యాటింగ్ దూకుడు ఏమాత్రం తగ్గలేదని ప్రపంచానికి చెప్పడానికి విరాట్ కోహ్లీకి ఐపీఎల్ అద్భుతమైన వేదిక. అతడిపై రేకెత్తిన పలు సందేహాలను ఈ టోర్నీలో పటాపంచలు చేస్తాడని ఫ్యాన్స్ బలంగా నమ్ముతున్నారు. -
Rohit Sharma: కెప్టెన్సీ లేని రోహిత్.. కోహ్లీలా రెచ్చిపోతాడా?
రోహిత్ శర్మ (Rohit Sharma) ఈ ఐపీఎల్ (IPL 2024) సీజన్లో కొత్త పాత్రలో కనిపించబోతున్నాడు. కెప్టెన్సీ బాధ్యతలు లేని అతడు.. తిరిగి బ్యాటింగ్‌లో ఒకప్పటి దూకుడును ప్రదర్శించాలని అభిమానులు కోరుతున్నారు.
తాజా వార్తలు (Latest News)
-
హార్దిక్ సవాళ్ల ప్రయాణం..
-
రంగులు తొలగిస్తే ఊరుకోను.. వైకాపా నాయకుడి వీరంగం
-
పాపాల పెద్దిరెడ్డికి దళితులంటే ఎందుకంత చులకన?
-
భయపెడుతున్న భువన్.. శివారు మున్సిపాలిటీల్లో ఆస్తిపన్ను నాలుగైదు రెట్లు పెంపు
-
నకిలీ కరెన్సీ నోట్లతో దొరికిన వైకాపా నేత బంధువు
-
రేటింగుల పేరుతో మోసం కేసులో రూ.32 కోట్ల జప్తు