IND vs ZIM: విరాట్‌ను ఔట్ చేసే అరుదైన అవకాశం.. మా బౌలర్లు వదులుకోరు: జింబాబ్వే కెప్టెన్

ఆస్ట్రేలియా వేదికగా సాగుతోన్న టీ20 ప్రపంచకప్‌ సూపర్ - 12 పోటీలు చివరి దశకు చేరాయి. ఆదివారం భారత్‌ - జింబాబ్వే జట్ల మధ్య జరిగే మ్యాచ్‌ గ్రూప్ స్టేజ్‌లో ఆఖరి మ్యాచ్‌ కావడం విశేషం.

Updated : 05 Nov 2022 13:51 IST

ఇంటర్నెట్ డెస్క్: ఇప్పుడందరి చూపు విరాట్ కోహ్లీ బ్యాటింగ్‌పైనే.. ప్రస్తుత టీ20 ప్రపంచకప్‌లో అద్భుతమైన ఫామ్‌లో ఉన్నాడు. ఇక సూపర్  -12 దశలో జింబాబ్వేతో భారత్‌ ఆదివారం చివరి మ్యాచ్‌ ఆడనుంది. ఈ మ్యాచ్‌లో గెలిస్తే నేరుగా సెమీస్‌కు వెళ్లిపోతుంది. ఒక వేళ ఓడితే మాత్రం ఇతర జట్ల ఫలితాలపై ఆధారపడాల్సి ఉంటుంది. అయితే లీగ్‌ దశలో టీమ్‌ఇండియా - జింబాబ్వే మ్యాచ్‌ చివరిది కావడం గమనార్హం. ఈ క్రమంలో జింబాబ్వే కెప్టెన్‌ క్రెయిగ్‌ ఇర్విన్‌ ప్రెస్‌ కాన్ఫెరెన్స్‌లో మాట్లాడుతూ.. తన బౌలర్లను ఉద్దేశించి కీలక సూచనలు చేశాడు. విరాట్ కోహ్లీని ఎదుర్కొనే అద్భుతమైన అవకాశం వచ్చిందని, మా బౌలర్లు కచ్చితంగా రాణిస్తారనే నమ్మకం ఉందని పేర్కొన్నాడు. 

‘‘గొప్ప ఆటగాళ్లకు బౌలింగ్‌ చేసే అవకాశం రావడం నిజంగా అద్భుతం. ఉత్తమ ప్రదర్శన ఇవ్వడానికి ఇదొక సదావకాశం. స్టార్‌ బ్యాటర్‌ విరాట్ కోహ్లీ వికెట్‌ తీసే అరుదైన అవకాశం మరోసారి ఎలా వస్తుంది..? అయితే మా ఫాస్ట్ బౌలర్లు కచ్చితంగా రాణిస్తారనే నమ్మకం ఉంది. విరాట్‌ను కట్టడి చేయడానికి ప్రత్యేకంగా ఎలాంటి ప్రణాళికలు ఆలోచించలేదు. ప్రస్తుతం ఉన్న అత్యుత్తమ ఆటగాళ్లలో అతడు ఒకడు. పక్కా ప్రణాళికతో వెళ్లినా కొన్నిసార్లు వర్కౌట్‌ కాకపోవచ్చు. పరిస్థితికి అనుగుణంగా ఆడేందుకు ప్రయత్నిస్తాం’’ అని ఇర్విన్ వెల్లడించాడు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని