గాయపడిన పాముకు 12 కుట్లు

రాజమహేంద్రవరం జేఎన్‌ రోడ్డు దాటుతున్న అయిదున్నర అడుగుల నాగుపాము ఓ ద్విచక్ర వాహనం కిందపడి గురువారం రాత్రి గాయపడింది. విక్రమ్‌ జైన్‌ అనే వ్యక్తి దాన్ని పట్టుకొని వన్యప్రాణి విభాగం వైద్యుడు ఆండ్ర ఫణీంద్రకు చూపించారు.

Updated : 27 Nov 2021 06:12 IST

రాజమహేంద్రవరం జేఎన్‌ రోడ్డు దాటుతున్న అయిదున్నర అడుగుల నాగుపాము ఓ ద్విచక్ర వాహనం కిందపడి గురువారం రాత్రి గాయపడింది. విక్రమ్‌ జైన్‌ అనే వ్యక్తి దాన్ని పట్టుకొని వన్యప్రాణి విభాగం వైద్యుడు ఆండ్ర ఫణీంద్రకు చూపించారు. నాగుపాము ఎడమవైపు దవడ కింది భాగం ఛిద్రమవడంతో 12 కుట్లు వేసి ఇంజక్షన్లు ఇచ్చారు. ఇది ఆరోగ్యంగా ఉందని కప్పను ఆహారంగా వేస్తే ఆరగించిందని ఫణీంద్ర తెలిపారు. సర్పరక్షకుడు వారాది ఈశ్వరరావు శుక్రవారం రాజమహేంద్రవరం నగర శివార్లలోని అటవీప్రాంతంలో దీన్ని విడిచిపెట్టారు.  

- ఈనాడు, రాజమహేంద్రవరం

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని