విశ్రాంత ఉద్యోగులకు పింఛన్‌ బకాయిలు జనవరి నుంచి

పింఛన్‌దారులకు పీఆర్‌సీలో ప్రకటించిన పింఛన్‌, గ్రాట్యుటీ బకాయిలను రాష్ట్ర ప్రభుత్వం కొత్త సంవత్సరం నుంచి చెల్లించనుంది. 2022 ఫిబ్రవరిలో అందే జనవరి పింఛను మొదలు బకాయిలను 36 విడతల్లో అందజేస్తుంది.

Published : 27 Nov 2021 04:28 IST

ఈనాడు, హైదరాబాద్‌: పింఛన్‌దారులకు పీఆర్‌సీలో ప్రకటించిన పింఛన్‌, గ్రాట్యుటీ బకాయిలను రాష్ట్ర ప్రభుత్వం కొత్త సంవత్సరం నుంచి చెల్లించనుంది. 2022 ఫిబ్రవరిలో అందే జనవరి పింఛను మొదలు బకాయిలను 36 విడతల్లో అందజేస్తుంది. 2020 ఏప్రిల్‌ తర్వాత మరణించిన పెన్షనర్ల కుటుంబాలకు మాత్రం బకాయిలను ఏకమొత్తంగా అందిస్తారు. ఈ మేరకు శుక్రవారం ప్రభుత్వం ఉత్తర్వులు (జీవో నెం. 1406) జారీ చేసింది. 2020 పీఆర్‌సీలో విశ్రాంత ఉద్యోగుల పింఛన్‌ను ప్రభుత్వం పెంచింది. గ్రాట్యుటీని రూ.12 లక్షల నుంచి రూ.16 లక్షలకు పెంచారు. వీటికి సంబంధించి 2020 ఏప్రిల్‌ నుంచి 2021 మార్చి 31 వరకు బకాయిలను 36 విడతల్లో చెల్లిస్తామని ప్రభుత్వం గతంలో ప్రకటించింది. ఇందుకు అనుగుణంగా బకాయిలు చెల్లించేందుకు ఆర్థిక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఉత్తర్వులిచ్చారు. ప్రభుత్వ ఉత్తర్వులపై విశ్రాంత గెజిటెడ్‌ అధికారుల సంఘం హర్షం వ్యక్తంచేసింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని