జాతీయ ఉపకారవేతనాలకు అర్హత మార్కుల తగ్గింపు

మైనార్టీ విద్యార్థులు జాతీయస్థాయి ప్రీ-మెట్రిక్‌, పోస్ట్‌మెట్రిక్‌ ఉపకార వేతనాలకు దరఖాస్తు చేసుకోవడానికి కనీస అర్హత మార్కులను కేంద్ర ప్రభుత్వం తగ్గించింది. గత విద్యాసంవత్సరంలో 50 శాతానికన్నా తక్కువ మార్కులు...

Published : 27 Nov 2021 04:28 IST

ఈనాడు, హైదరాబాద్‌: మైనార్టీ విద్యార్థులు జాతీయస్థాయి ప్రీ-మెట్రిక్‌, పోస్ట్‌మెట్రిక్‌ ఉపకార వేతనాలకు దరఖాస్తు చేసుకోవడానికి కనీస అర్హత మార్కులను కేంద్ర ప్రభుత్వం తగ్గించింది. గత విద్యాసంవత్సరంలో 50 శాతానికన్నా తక్కువ మార్కులు పొందిన విద్యార్థులు కూడా ప్రీ-మెట్రిక్‌ (ఆరు నుంచి పదో తరగతి) కేటగిరీలో ఫ్రెషర్‌గా దరఖాస్తు చేసుకునేందుకు కేంద్రం ఈ సారి (2021-22 విద్యాసంవత్సరం) వెసులుబాటు కల్పించిందని రాష్ట్ర మైనార్టీ సంక్షేమ శాఖ డైరెక్టర్‌ షానవాజ్‌ ఖాసీం ఒక ప్రకటనలో తెలిపారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని