సంక్షిప్త వార్తలు

రాష్ట్రం ఏర్పడిన ఏడేళ్ల కాలంలో జల సంరక్షణ, పొదుపు రంగాల్లో విశిష్ట సేవలందించినవారికి ప్రోత్సాహకాలు ఇవ్వనున్నట్లు తెలంగాణ జలవనరుల అభివృద్ధి సంస్థ ఛైర్మన్‌ వి.ప్రకాశ్‌ శుక్రవారం తెలిపారు.

Published : 27 Nov 2021 04:28 IST

‘జల సంరక్షణ అవార్డులకు దరఖాస్తు చేసుకోండి’

రాష్ట్రం ఏర్పడిన ఏడేళ్ల కాలంలో జల సంరక్షణ, పొదుపు రంగాల్లో విశిష్ట సేవలందించినవారికి ప్రోత్సాహకాలు ఇవ్వనున్నట్లు తెలంగాణ జలవనరుల అభివృద్ధి సంస్థ ఛైర్మన్‌ వి.ప్రకాశ్‌ శుక్రవారం తెలిపారు. హైదరాబాద్‌ నగరపాలక సంస్థ పరిధిలో నీటి సంరక్షణలో విశేష సేవలందించిన వ్యక్తులు, సంస్థలను నీటి సంరక్షణ అవార్డులు-2021 కింద ఎంపిక చేయనున్నట్లు తెలిపారు. https://tswalamtari.weebly.com  వెబ్‌సైట్‌ నుంచి పూర్తి వివరాలను, దరఖాస్తు ఫారాన్ని పొందొచ్చని ఆయన సూచించారు.


కృష్ణా ట్రైబ్యునల్‌ విచారణ వాయిదా  

కృష్ణా నీటి పంపకాలపై ఇరురాష్ట్రాల వాదనలు వింటున్న కృష్ణా జలాల వివాద ట్రైబ్యునల్‌ విచారణ వాయిదా పడింది. శుక్రవారం తెలంగాణ తరఫున సాక్షి, కేంద్ర జలసంఘం మాజీ ఛైర్మన్‌ ఘన్‌శ్యామ్‌ ఝాను ఏపీ తరఫు సీనియర్‌ న్యాయవాది వెంకటరమణి క్రాస్‌ ఎగ్జామినేషన్‌ చేశారు. అనంతరం విచారణ ట్రైబ్యునల్‌ వాయిదా వేసింది.


200 మందికి ఆచార్యులుగా పదోన్నతి

ప్రభుత్వ వైద్య కళాశాలల్లో సహ ఆచార్యులుగా కొనసాగుతున్న 200 మందికి ప్రభుత్వం ఆచార్యులుగా పదోన్నతి కల్పించింది. 24 విభాగాల్లో ఈ పదోన్నతుల ప్రక్రియ నిర్వహించారు. పదోన్నతులు పొందిన వారు రాష్ట్రంలోని కొత్త ఆసుపత్రుల్లో ఆచార్యులుగా సేవలందిస్తారని వైద్య విద్య సంచాలకులు రమేశ్‌రెడ్డి తెలిపారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని