1 నుంచి బీఫార్మసీ కౌన్సెలింగ్‌

ఎంసెట్‌ అగ్రికల్చర్‌లో ఉత్తీర్ణులైన విద్యార్థులు బీఫార్మసీతోపాటు మరో మూడు కోర్సు (ఫార్మా డి, బయోటెక్నాలజీ, ఫార్మాస్యూటికల్‌ ఇంజినీరింగ్‌)ల్లో చేరేందుకు డిసెంబరు 1 నుంచి కౌన్సెలింగ్‌ మొదలుకానుంది.

Updated : 28 Nov 2021 06:20 IST

ఎంసెట్‌ అగ్రికల్చర్‌ విద్యార్థుల కోసం నిర్వహణ

ఈనాడు, హైదరాబాద్‌: ఎంసెట్‌ అగ్రికల్చర్‌లో ఉత్తీర్ణులైన విద్యార్థులు బీఫార్మసీతోపాటు మరో మూడు కోర్సు (ఫార్మా డి, బయోటెక్నాలజీ, ఫార్మాస్యూటికల్‌ ఇంజినీరింగ్‌)ల్లో చేరేందుకు డిసెంబరు 1 నుంచి కౌన్సెలింగ్‌ మొదలుకానుంది. ప్రవేశాల కమిటీ కన్వీనర్‌ నవీన్‌ మిత్తల్‌ శనివారం తొలి, చివరివిడత కౌన్సెలింగ్‌ కాలపట్టికలను విడుదల చేశారు.  4 కోర్సుల్లో కన్వీనర్‌ కోటా కింద 8,773 సీట్లు అందుబాటులో ఉన్నాయని తెలిపారు. డిసెంబరు 10వ తేదీకి మొదటి విడత కౌన్సెలింగ్‌ పూర్తవుతుందని, 13నుంచి చివరివిడత మొదలవుతుందన్నారు.

తొలి కౌన్సెలింగ్‌ కాలపట్టిక ఇదీ..
* డిసెంబరు 1-3: ప్రాసెసింగ్‌ ఫీజు చెల్లింపు, స్లాట్‌ బుకింగ్‌

* 3-4వ తేదీ వరకు: ధ్రువపత్రాల పరిశీలన

* 3-5వ తేదీ వరకు: వెబ్‌ ఆప్షన్లకు అవకాశం

* 7వ తేదీ: సీట్ల కేటాయింపు

* 7-10వ తేదీ వరకు: సెల్ఫ్‌ రిపోర్టింగ్‌కు గడువు

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని