నిధులిచ్చి ఆదుకోండి

ఆంధ్రప్రదేశ్‌లో చిత్తూరు, అనంతపురం, కడప, నెల్లూరు జిల్లాల్లో కురిసిన భారీ వర్షాలు, వరదలకు తీవ్ర నష్టం వాటిల్లిందని, ప్రజలను ఆదుకోవడానికి సత్వరం నిధులివ్వాలని కేంద్ర బృందాన్ని

Updated : 28 Nov 2021 05:16 IST

కేంద్ర బృందానికి ఆంధ్రప్రదేశ్‌ విజ్ఞప్తి

ఈనాడు డిజిటల్‌, తిరుపతి: ఆంధ్రప్రదేశ్‌లో చిత్తూరు, అనంతపురం, కడప, నెల్లూరు జిల్లాల్లో కురిసిన భారీ వర్షాలు, వరదలకు తీవ్ర నష్టం వాటిల్లిందని, ప్రజలను ఆదుకోవడానికి సత్వరం నిధులివ్వాలని కేంద్ర బృందాన్ని రాష్ట్ర ప్రభుత్వం కోరింది. శనివారం తిరుపతిలో కేంద్రం బృందంతో రాష్ట్ర ప్రభుత్వం తరఫున రాష్ట్ర రెవెన్యూశాఖ ముఖ్య కార్యదర్శి ఉషారాణి సమావేశమై జరిగిన నష్టాన్ని వివరించారు. ‘నాలుగు జిల్లాల్లో 199మండలాలు, 1,990గ్రామాలకు నష్టం జరిగింది. 211గ్రామాలు, 23పట్టణాలు ముంపునకు గురయ్యాయి. 2.31లక్షల మంది వరద బాధితులయ్యారు. మొత్తం 44మంది మృతి చెందగా... 15మంది గల్లంతయ్యారు. 5,740గృహాలు దెబ్బతిన్నాయి. 98,514గృహాలు ముంపునకు గురయ్యాయి. 2.86లక్షల హెక్టార్లలో పంట నష్టం జరిగింది. ఇందులో 75శాతం వరి ఉంది’ అని ఆమె వివరించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని