
Published : 28 Nov 2021 05:24 IST
సచివాలయ ప్రాంగణంలో ఆలయం, చర్చి పనులు త్వరలో ప్రారంభం
సచివాలయ ప్రాంగణంలో నిర్మించే ఆలయం నమూనా
ఈనాడు, హైదరాబాద్: తెలంగాణ నూతన సచివాలయ ప్రాంగణంలో ఆలయం, చర్చిల నిర్మాణ పనులను త్వరలో ప్రారంభించడానికి రంగం సిద్ధమవుతోంది. ఆలయ నిర్మాణ బాధ్యతను ప్రభుత్వం దేవాదాయ శాఖకు అప్పగించింది. చర్చి నిర్మాణ బాధ్యతను సంబంధిత సంస్థలకు అప్పగించాలని నిర్ణయించింది. సచివాలయ నమూనాలను రూపొందించిన ఆస్కార్ అండ్ పొన్ని ఆర్కిటెక్ట్స్ సంస్థ ప్రార్థన మందిరాల నమూనాలూ రూపొందించింది. మసీదు నిర్మాణ పనులను గురువారమే లాంఛనంగా ప్రారంభించారు. ఒక్కో ప్రార్థనా మందిరానికి 1,500 చదరపు గజాల స్థలాన్ని కేటాయించారు. నిర్మాణ వ్యయాన్ని కూడా ప్రభుత్వమే భరిస్తుందని ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రకటించారు.
చర్చి నిర్మిస్తారిలా..
Tags :