మిర్చి నాణ్యతను నిర్ధారిస్తుంది..

ప్రస్తుతం రైతులు మార్కెట్‌కు తీసుకొచ్చే ఎండు మిరప కాయలు నాణ్యతతో ఉన్నా.. చాలా సందర్భాల్లో సరైన గిట్టుబాటు ధర దక్కడం లేదు. నాణ్యత పరీక్షల పేరిట జాప్యం జరుగుతోంది. ఈ సమస్యకు పరిష్కారంగా

Published : 29 Nov 2021 04:45 IST

రాష్ట్రంలోని 5 మార్కెట్లలో 8 యంత్రాల ఏర్పాటు

ఈనాడు డిజిటల్‌, మహబూబాబాద్‌: ప్రస్తుతం రైతులు మార్కెట్‌కు తీసుకొచ్చే ఎండు మిరప కాయలు నాణ్యతతో ఉన్నా.. చాలా సందర్భాల్లో సరైన గిట్టుబాటు ధర దక్కడం లేదు. నాణ్యత పరీక్షల పేరిట జాప్యం జరుగుతోంది. ఈ సమస్యకు పరిష్కారంగా కోల్‌కతాకు చెందిన సెంటర్‌ ఫర్‌ డెవలప్‌మెంట్‌ ఆఫ్‌ అడ్వాన్స్‌ కంప్యూటింగ్‌(సీ-డాక్‌) సంస్థ అత్యాధునిక సాంకేతికతతో కూడిన మిర్చి నాణ్యత నిర్ధారణ యంత్రాన్ని అందుబాటులోకి తీసుకొచ్చింది. రాష్ట్రంలోని అయిదు వ్యవసాయ మార్కెట్లలో ఎనిమిది యంత్రాలను ఏర్పాటు చేశారు. మూడు ఖమ్మంలో, రెండు వరంగల్‌లో, మహబూబాబాద్‌, కేసముద్రం, హైదరాబాద్‌లలో ఒక్కొక్కటి చొప్పున ఏర్పాటు చేశారు. యంత్రం పనితీరు, మిర్చి నాణ్యతను ఏ విధంగా పరిశీలించాలో సిబ్బందికి అవగాహన కల్పించినట్లు సీ-డాక్‌ ప్రిన్సిపల్‌ శాస్త్రవేత్త పాలకుర్తి వంశీకృష్ణ తెలిపారు. మిరపకాయల్లో మనకు కనిపించని 256 రంగులుంటాయని.. వాటన్నింటినీ యంత్రంలోని కెమెరా గుర్తిస్తుందని  చెప్పారు.

అయిదు నిమిషాల్లో ఫలితం

కిలో ఎండు మిరప కాయలను యంత్రానికి ఉన్న పెద్ద పెట్టెలో పోయాలి. అది వైబ్రేట్‌ అవుతూ 4 నుంచి ఆరేడు కాయల చొప్పున రన్నింగ్‌లో ఉండే బెల్టుపైకి వెళ్తాయి. అది ముందుకు వెళ్తున్నప్పుడు మధ్యలో ఒక బాక్స్‌లో ఉన్న కెమెరా కాయల ఫొటోను తీసి, వాటి భౌతిక ప్రమాణాల స్థాయులను కంప్యూటర్‌ ద్వారా తెలియజేస్తుంది. ఇందుకు అయిదు నిమిషాల సమయం పడుతుంది. కాయ పొడవు, గింజల శాతం వాటి బరువు, రంగుతోపాటు అందులో ఎంత మేర వ్యర్థాలు(తొడిమెలు, విరిగిన కాయలు) ఉన్నాయో తెలుపుతుంది. దీని ఆధారంగా సరైన ధరను నిర్ణయించడానికి దోహదపడుతుంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని