శరీరంలో దిగిన 3 అడుగుల ఇనుపచువ్వ తొలగింపు

ఓ వ్యక్తి పిరుదుల భాగం నుంచి ఎడమ భుజం వరకు శరీరం లోపల చొచ్చుకు వచ్చిన ఇనుపచువ్వను తొలగించే క్లిష్టమైన శస్త్రచికిత్సను సోమవారం తిరుపతి స్విమ్స్‌ ఆస్పత్రిలో విజయవంతంగా నిర్వహించారు. వైద్యుల కథనం ప్రకారం..

Published : 30 Nov 2021 05:10 IST

తిరుపతి (స్విమ్స్‌), న్యూస్‌టుడే: ఓ వ్యక్తి పిరుదుల భాగం నుంచి ఎడమ భుజం వరకు శరీరం లోపల చొచ్చుకు వచ్చిన ఇనుపచువ్వను తొలగించే క్లిష్టమైన శస్త్రచికిత్సను సోమవారం తిరుపతి స్విమ్స్‌ ఆస్పత్రిలో విజయవంతంగా నిర్వహించారు. వైద్యుల కథనం ప్రకారం.. కృష్ణా జిల్లా కైకలూరుకు చెందిన కె.లక్ష్మయ్య ఈ నెల 27న తాపీ పని చేస్తూ ప్రమాదవశాత్తు భవనం పైనుంచి కింద పడ్డారు. కింద నిర్మాణ దశలోని ఇనుప చువ్వపై పడటంతో.. పిరుదుల నుంచి ఎడమ భుజం వరకు శరీరంలో చొచ్చుకుపోయింది. ఆదివారం తిరుపతిలోని స్విమ్స్‌ ఆస్పత్రి వైద్యులు పరీక్షించి 10 ఎం.ఎం.సైజు.. మూడు అడుగుల పొడవున్న ఇనుపచువ్వ శరీరంలో చొచ్చుకుపోయినట్లు గుర్తించారు. సర్జికల్‌ గ్యాస్ట్రో ఎంట్రాలజీ విభాగాధిపతి ప్రొఫెసర్‌ వి.వెంకటరామిరెడ్డి ఆధ్వర్యంలో సీటీ సర్జరీ విభాగం వైద్యురాలు డాక్టర్‌ సత్యవతి, మత్తు వైద్యనిపుణులు డాక్టర్‌ మధుసూదన్‌ అత్యంత క్లిష్టమైన సర్జరీని విజయవంతంగా నిర్వహించారు. లక్ష్మయ్య ప్రస్తుతం ఆస్పత్రిలో కోలుకుంటున్నారు.

భుజం నుంచి శరీరంలోకి చొచ్చుకెళ్లిన ఇనుపచువ్వ ఎక్స్‌రేలో

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని