Published : 30/11/2021 05:10 IST

వరి కొనుగోలుపై వివరణ ఇవ్వండి

రాష్ట్ర ప్రభుత్వానికి హైకోర్టు నోటీసులు

ఈనాడు, హైదరాబాద్‌: రాష్ట్రంలో ఖరీఫ్‌ వానాకాలం వరి ధాన్యం కొనుగోలుపై వివరణ ఇవ్వాలంటూ ప్రభుత్వానికి హైకోర్టు నోటీసులు జారీ చేసింది. ధాన్యం కొనుగోళ్ల నిరాకరణపై కౌంటర్లు దాఖలు చేయాలని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను ఆదేశించింది. ఖరీఫ్‌ సీజన్‌లో వరి ధాన్యాన్ని సేకరించేలా ప్రభుత్వాన్ని ఆదేశించాలంటూ న్యాయ విద్యార్థి బి.శ్రీకర్‌ హైకోర్టులో ప్రజాప్రయోజన వ్యాజ్యం దాఖలు చేశారు. దీనిపై సోమవారం ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ సతీష్‌ చంద్రశర్మ, జస్టిస్‌ ఎ.రాజశేఖర్‌రెడ్డిల ధర్మాసనం విచారణ చేపట్టింది. పిటిషనర్‌ తరఫు న్యాయవాది వాదనలు వినిపిస్తూ 2021 నుంచి 2022 జనవరి వరకు 40 లక్షల మెట్రిక్‌ టన్నుల బియ్యాన్ని సేకరిస్తామని రాష్ట్ర ప్రభుత్వం అంగీకరించిందని అన్నారు. ఆగస్టు 17న కేంద్ర కార్యదర్శితో జరిగిన సమావేశంలో అంగీకారం తెలిపిందని చెప్పారు. రైతులు పండించిన లక్షల టన్నుల ధాన్యం సేకరించకపోవడంతో నిల్వలు మూలుగుతున్నాయన్నారు. అధికారులు కొనుగోలుకు నిరాకరించడంతో రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారన్నారు. ధాన్యం సేకరణ కేంద్రాల్లో ఉన్న నిల్వలకు సంబంధించి రాష్ట్ర వాతావరణ పరిస్థితులు ప్రతికూలంగా ఉన్నాయని, సేకరణ కేంద్రాల్లో ఉన్న వడ్లు దెబ్బతినే అవకాశం ఉందంటూ ప్రచురించిన పత్రికా కథనాలను పరిశీలించాలన్నారు. ఈ వ్యవహారంపై తమకు అవగాహన ఉందని కోర్టు పేర్కొంది. ధాన్యం సేకరణపై విధానమేమిటో చెప్పాలంటూ తెలంగాణ ఫుడ్‌ కార్పొరేషన్‌, కేంద్ర ఫుడ్‌ కార్పొరేషన్‌లకు నోటీసులు జారీ చేస్తూ డిసెంబరు 6లోగా కౌంటర్లు దాఖలు చేయాలని ఆదేశిస్తూ విచారణను వాయిదా వేసింది.

Read latest State News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News. Subscribe our Telegram Channel.

Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు

సినిమా

మరిన్ని

బిజినెస్

మరిన్ని

క్రీడలు

మరిన్ని

పాలిటిక్స్

మరిన్ని

వెబ్ ప్రత్యేకం

మరిన్ని

జాతీయం

మరిన్ని